అన్వేషించండి

Stalin reaction: 3 శాతం ఓట్ల తేడాతోనే ఓటమి.. గౌరవంగా స్వీకరిస్తాం - రాజీనామా తర్వాత స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్

Stalin first reaction: ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతమని నమ్మే డీఎంకే, ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని స్టాలిన్ అన్నారు. బలమైన ప్రతిపక్షంగా పోరాటం చేస్తామని ప్రకటించారు.

Stalin accept defeat with dignity:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు ఓటు వేసిన కోట్లాది మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని అమూల్యమైనదిగా భావిస్తున్నానని, గెలుపోటములకు అతీతంగా ప్రజాపక్షాన నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.

 తేడా 3.52 శాతమే.. మాపై నమ్మకం చెక్కుచెదరలేదు!

ఎన్నికల గణాంకాలను వివరిస్తూ.. డీఎంకే కూటమికి ఈ ఎన్నికల్లో మొత్తం  1 కోటి 54 లక్షల 82 వేల 782 ఓట్లు  వచ్చాయని స్టాలిన్ పేర్కొన్నారు. విజయం సాధించిన పార్టీకి తమకంటే కేవలం  17.43 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయని, ఓట్ల శాతం పరంగా చూస్తే ఈ వ్యత్యాసం కేవలం  3.52 శాతం మాత్రమేనని ఆయన విశ్లేషించారు. ఈ గణంకాలు ప్రజలకు తమపై ఉన్న బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజల వద్దకే వెళ్లి కృతజ్ఞతలు చెప్పండి - అభ్యర్థులకు ఆదేశం 

ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతమని నమ్మే డీఎంకే, ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని స్టాలిన్ అన్నారు.  మనం ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నామో, ఆ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం మన బాధ్యత  అని పేర్కొంటూ, విజయం సాధించిన అభ్యర్థులందరూ వెంటనే తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు తెలపాలని ఆయన ఆదేశించారు.

సిద్ధాంతం ముఖ్యం.. కార్యకర్తలే ప్రాణం! 

డీఎంకే ఇప్పటివరకు ఆరుసార్లు అధికారంలో ఉందని, ఎన్నో విజయాలను, అపజయాలను చూసిందని స్టాలిన్ గుర్తు చేశారు.  రాజకీయ ప్రయాణంలో గెలుపోటములు సహజం, కానీ మన సిద్ధాంతం ఓడిపోకూడదు. విజయ గర్వం లేకుండా, అపజయానికి కుంగిపోకుండా ఆశయ సాధన కోసం నడిచేవారే నిజమైన కార్యకర్తలు  అని ఆయన కొనియాడారు. పార్టీ శ్రేణులు పంపిన ఓదార్పు సందేశాలపై స్పందిస్తూ.. మీరు నా వెంట ఉన్నంత కాలం నాకు చింత లేదు.. మీరు ఈ ఉద్యమానికి జీవనాడి వంటివారు  అని భావోద్వేగానికి లోనయ్యారు.    

 బలమైన ప్రతిపక్షంగా ప్రజా పోరాటం 

భవిష్యత్ కార్యాచరణపై స్పందిస్తూ.. అధికారంలో ఉంటే పథకాల ద్వారా, ప్రతిపక్షంలో ఉంటే పోరాటాల ద్వారా ప్రజలకు సేవ చేస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఇప్పుడు ఒక బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగుపెట్టి, ప్రజల డిమాండ్ల కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధిల అడుగుజాడల్లో నడుస్తూ.. ద్రవిడ ఉద్యమ ఆశయాలను, తమిళ భాషను, జాతిని కాపాడుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. మనం మళ్ళీ గెలుస్తాం!  అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.                              

టాప్ హెడ్ లైన్స్

Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget