అన్వేషించండి

Fake Paneer: మార్కెట్‌లోఉన్న పనీర్‌లో సగం ఫేకే - నోయిడాలో 500 కేజీల పట్టివేత - అసలైనదేదో ఎలా తెలుస్తుంది ?

Fake paneer: దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, నోయిడా అధికారులు 500 కిలోల ఫేక్ పనీర్‌ను స్వాధీనం చేసి, నాశనం చేశారు. దేశవ్యాప్తంగా ఫేక్ పనీర్ గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Fake paneer is flooding the market   హర్యానాలోని మేవాత్‌లోని జంగి మిల్క్ ప్లాంట్ నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్లకు తరలిస్తున్న  ఫేక్ పనీర్ ను  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారులు దీనిని అడ్డుకున్నారు.   పనీర్ చెడిపోయినట్లు, ఆహారానికి అనువైనది కాదని తెలిసి, ల్యాబ్ టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. ఈ 500 కేజీల పనీర్‌ను నోయిడాలోని భంగేల్‌లోని న్యూ గర్హ్వాల్ డైరీలో స్టోర్ చేసి, మరుసటి రోజు స్థానిక అధికారుల సహాయంతో నాశనం చేశారు. 

ఫేక్ పనీర్ తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో రిఫైన్డ్ ఆయిల్, కెమికల్స్, స్టార్చ్, స్కిమ్ మిల్క్ పౌడర్ వంటివి కలుపుతారు, ఇవి శరీరానికి హానికరం. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం.  దుర్వాసన వచ్చే ఫేక్ పనీర్ బ్యాక్టీరియా పెరిగి, వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ కలిగిస్తుంది. కెమికల్స్, రిఫైన్డ్ ఆయిల్ లివర్‌ను దెబ్బతీసి, జాండిస్, లివర్ ఫెయిల్యూర్ వంటివి కలిగించవచ్చు. స్టార్చ్, సింథటిక్ మెటీరియల్స్ జీర్ణవ్యవస్థను దెబ్బతీసి, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇన్‌ఫెక్షన్లు తెచ్చిపెడతాయి.  దీర్ఘకాలంగా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్, హార్మోనల్ ఇంబాలెన్స్, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. పండుగ సమయంలో ఇటువంటి ప్రొడక్ట్స్ తినడం వల్ల ఆసుపత్రి పాలవడం సాధారణం.

నిపుణులు చెబుతున్నట్లు, ఫేక్ పనీర్‌లో ఫ్యాట్ కంటెంట్ 28% కంటే తక్కువ ఉండటం FSSAI నిబంధనలకు విరుద్ధం, ఇది ఆరోగ్యానికి ముప్పు. పనీర్ కొనడానికి ముందు లేదా తినడానికి ముందు స్వచ్ఛత తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రెష్ పనీర్ మైల్డ్ వాసన, ఫర్మ్ టెక్స్చర్, వైట్ కలర్ కలిగి ఉండాలి. స్టికీగా ఉండటం, అసాధారణ కలర్, దుర్వాసన వస్తే అడల్టరేటెడ్ అని అర్థం. వె 

ఫేక్ పనీర్‌ను  ఇలా గుర్తించండి:

1. వాసన తనిఖీ: ఫ్రెష్ పనీర్ మైల్డ్ మిల్కీ అరోమా కలిగి ఉంటుంది. సౌర్, కెమికల్ లాంటి లేదా స్ట్రాంగ్ వాసన వస్తే ఫేక్.
2.  కలర్ చూడండి:  జెన్యూన్ పనీర్ వైట్ లేదా ఆఫ్-వైట్. ఎల్లోయిష్, డల్ లేదా అసమాన కలర్ ఉంటే ఫేక్.
3.  టెక్స్చర్ ఫీల్ చేయండి:  రియల్ పనీర్ సాఫ్ట్, స్లైట్లీ స్ప్రింగీ, షేప్ హోల్డ్ చేస్తుంది. స్టికీ, ముషీ లేదా హార్డ్‌గా ఉంటే అడల్టరేటెడ్.
4.  వాటర్ టెస్ట్:  చిన్న ముక్కను నీటిలో వేయండి. ఫ్రెష్ పనీర్ నెమ్మదిగా మునిగిపోతుంది. స్టార్చ్, కెమికల్స్, ఆయిల్ ఎక్కువ ఉంటే  తేలుతుంది. 
5.   టేస్ట్ చేయండి: రియల్ పనీర్ మైల్డ్, క్రీమీ టేస్ట్. బిట్టర్, సోపీ లేదా కెమికల్ టేస్ట్ వస్తే హెచ్చరిక.
6.  ఎక్సెస్ ఆయిల్ చెక్: ప్రెస్ చేసినప్పుడు లేదా వంట చేసినప్పుడు చేసినప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుందా చూడండి, రిఫైన్డ్ ఆయిల్స్ లేదా కెమికల్స్ ఉంటే ఇలా జరుగుతుంది.
7.  బ్రాండెడ్ కొనుగోలు బెటర్ : వెరిఫైడ్ షాప్స్ లేదా బ్రాండెడ్ డైరీల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తే బెటర్. స్ట్రీట్ వెండర్లు, అన్‌లేబుల్డ్ ప్రొడక్ట్స్  కొనుగోలు చేయవద్దు. 
8.  ఎక్స్‌పైరీ, లేబులింగ్ చెక్:* ప్యాకేజ్డ్ పనీర్‌లో మాన్యుఫాక్చరింగ్, ఎక్స్‌పైరీ డేట్స్ ఉండాలి. మిస్సింగ్ లేబుల్స్   ఉంటే ఫేక్.
 
 ఫేక్ పనీర్‌ కనిపిపిస్తే  ఫిర్యాదులు చేయవచ్చు !

 ఫేక్ పనీర్ ను గుర్తిస్తే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్: 1800-11-2100 కు కాల్ చేయవచ్చు.   ఈమెయిల్  consumeraffairs@fssai.gov.inకు ఫిర్యాదు చేయవచ్చు. ఆన్‌లైన్ కంప్లైంట్ ను https://foodlicensing.fssai.gov.in ఈ అడ్రస్‌లో  “కన్స్యూమర్ కంప్లైంట్స్” వద్ద ఇవ్వచ్చు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Sex work legality in India 2026: సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో సెక్స్ వర్క్ చట్టబద్ధమైనట్లు కాదు - చట్టాలు ఏం చెబుతున్నాయంటే ?
సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో సెక్స్ వర్క్ చట్టబద్ధమైనట్లు కాదు - చట్టాలు ఏం చెబుతున్నాయంటే ?
Swami Chinmayanand 550 crore donation: స్వామి చిన్మయానంద్ సంచలనం - రూ. 550 కోట్ల ఆస్తులు యూనివర్సిటీకి దానం - ఈయన చరిత్ర చిన్నదేం కాదు!
స్వామి చిన్మయానంద్ సంచలనం - రూ. 550 కోట్ల ఆస్తులు యూనివర్సిటీకి దానం - ఈయన చరిత్ర చిన్నదేం కాదు!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget