అన్వేషించండి

Gujarat Himachal Exit Poll: ఆమ్‌ఆద్మీకి అంతేనా! 2017లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయా?

Gujarat Himachal Exit Poll: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మరి 2017లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి.

Gujarat Himachal Exit Poll: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. ఇక డిసెంబర్ 8న ఫలితాలు వచ్చే వరకు నాయకులకు కంటి మీద కునుకు ఉండదు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా తమ అంచనాలు చెప్పేశాయి.

హిమాచల్‌ప్రదేశ్

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ భాజపా గెలిచే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్- సీ ఓటర్‌ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. 68 స్థానాల్లో మెజార్టీ సీట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. 

ABP న్యూస్-CVoter ఎగ్జిట్ పోల్ ప్రకారం భాజపా 33-41 సీట్లు సాధిస్తుందని అంచనా. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 44 స్థానాల కన్నా తక్కువగానే గెలిచే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 24-32 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 21 సీట్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ సర్వేలో తెలుస్తోంది.  ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సీఓవర్ ఎగ్జిట్ పోల్స్ చెబుతుంది. 

ALLIANCE WIN/LEADS
BJP 33-41
INC 24-32
AAP 00
OTH 0-4
 
గుజరాత్
 
182 స్థానాలున్న గుజరాత్‌లో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. భాజపా 128-140 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి. కాంగ్రెస్ 31-43 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందన్నాయి. మరోవైపు ఆప్ 3-11 స్థానాలు మాత్రమే సాధిస్తుందని పేర్కొన్నాయి.
 
ALLIANCE WIN/LEADS
BJP 128-140
INC 31-43
AAP 3-11
OTH 2-6

సాధారణంగా క్షేత్ర స్థాయిలో ఒపీనియన్​, ఎగ్జిట్​ పోల్స్​ ద్వారా మీడియా ఛానళ్లు సర్వేలు నిర్వహిస్తాయి. ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో కొన్నిసార్లు ఇవి సఫలమయ్యాయి. మరికొన్ని సార్లు ఘోరంగా విఫలమయ్యాయి. మరి 2017లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి. అవి నిజమయ్యాయా? 

2017 ఎగ్జిట్ పోల్స్

2017లో గుజరాత్‌లో భాజపానే స్వీప్‌ చేయనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఆ పార్టీ 112 నుంచి 116 స్థానాల్లో గెలుస్తుందని లెక్కకట్టాయి. కానీ అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 182 స్థానాలకు గాను 99 స్థానాల్లో భాజపా గెలిచింది. తొలి దశ పోలింగ్‌ జరిగిన 89 స్థానాల్లో 48 గెలుచుకోగా రెండో దశ పోలింగ్‌లో 51 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్‌కు 65 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెప్పగా.. 77 స్థానాల్లో గెలుపొందింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో 2017లో భాజపా అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అప్పట్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. భాజపా 47చోట్ల గెలుస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్‌కు సుమారు 22 సీట్లు వస్తాయని చెప్పాయి. అందుకు తగ్గట్లుగానే భాజపాకు 44 సీట్లు వచ్చాయి.

ఆప్‌కు అంత తక్కువా?

అయితే దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ ఈసారి గుజరాత్‌, హిమాచల్‌ రాష్ట్రాలపై దృష్టి సారించి విస్తృత ప్రచారం నిర్వహించింది. ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ అయితే ఈ సారి గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం ఆ పార్టీకి రెండంకెల సీట్లు కూడా రావని తేలింది. మరి ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ పట్టుకున్నాయా? లేదా? అనేది డిసెంబర్ 8న తేలనుంది.

Also Read: Gujarat Exit Poll 2022: గుజరాత్‌ మళ్లీ బీజేపీ ఖాతాలోకే! ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాషాయానిదే హవా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget