అన్వేషించండి

Tollywood Drugs : బీ రెడీ ! నేటి నుంచి టాలీవుడ్ స్టార్స్ ఈడీ విచారణ సీరియల్ !

టాలీవుడ్ ప్రముఖులకు కొత్తగా ఈడీ కేసు టెన్షన్ పట్టుకుంది. మంగళవారం నుంచి వరుసగా అందర్నీ ప్రశ్నించనున్నారు. పూరి జగన్నాథ్ మొదటి వ్యక్తిగా ఈడీ ఎదుట హాజరవుతున్నారు.


టాలీవుడ్‌ మొత్తం టెన్షన్‌లో ఉంది. ముగిసిపోయిందనుకున్న కేసు మళ్లీ మంగళవారం నుంచి డైలీ సీరియల్‌గా హైలెట్ కాబోతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం ఇవాళ సెలబ్రిటీల విచారణ ప్రారంభమవుతుంది. మంగళవారం ఈడీ ముందు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హాజరుకానున్నారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు రావాలో కూడా సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 22వరకు వరుసగా అందర్నీ ప్రశ్నించనున్నారు.
Tollywood Drugs : బీ రెడీ ! నేటి నుంచి టాలీవుడ్ స్టార్స్ ఈడీ విచారణ సీరియల్ !

మనీలాండరింగ్ కోణంలోనే విచారణ..!

అయితే వీరంతా డ్రగ్స్ వాడారా లేదా అన్నదానిపై విచారణ జరగడం లేదు. డ్రగ్స్ కొనుగోలు కోసం వెచ్చిన మొత్తాన్ని ఎలా పంపారు.. లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశంపైనే ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్ మెంట్ క్రైం ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఆ మేరకు అదనపు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గతంలో మొత్తం 62 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ కూడా అందర్నీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పాత నేరస్తుల్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు.
Tollywood Drugs : బీ రెడీ ! నేటి నుంచి టాలీవుడ్ స్టార్స్ ఈడీ విచారణ సీరియల్ !

నేరం తేలిస్తే ఆస్తుల జప్తునకు సన్నాహాలు..! 

మరో వైపు ఈడీ వర్గాలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. డ్రగ్స్ ఎలా తెప్పించేవారు..?  డబ్బులు ఎలా చెల్లించారు..? అన్న వాటిపై పూర్తి సమాచారం ఈడీ అధికారులు సేకరించారని.. వాటిని ముందు పెట్టి సినీ ప్రముఖులను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. హవాలా మార్గం ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా భావిస్తున్నారు. అలాగే నేరం చేసినట్లుగా నిరూపితమైతే ఆస్తులు జప్తు చేస్తారు. పబ్ నిర్వహించే ఓ సినీ ప్రముఖుడు పెద్ద ఎత్తున తెప్పించి సినీ వర్గాలకు సరఫరా చేశాడని.. ఆయన ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Tollywood Drugs : బీ రెడీ ! నేటి నుంచి టాలీవుడ్ స్టార్స్ ఈడీ విచారణ సీరియల్ !
ఈడీ కేసులో ఇరుక్కుంటే ఎక్సైజ్ కేసులు కూడా బయటకు..! 

మరో వైపు సినీ ప్రముఖులకు మరో టెన్షన్ పట్టుకుంది. ఈడీ కేసుల్లో దొరికిపోతే.. ఇప్పటి వరకూ వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చార్జిషీట్‌లో పేరు కూడా పెట్టని తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు తమ చార్జిషీట్లను సవరిస్తారేమోనని భయపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ ఆ సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడారన్నదానికి ఆధారాలు దొరకలేదని వారి పేర్లను చార్జిషీట్లలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేర్చలేదు. ఇప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఈడీ తేల్చితే వారిపై ఎక్సైజ్ శాఖ కూడా కొత్తగా చర్యలు తీసుకోక తప్పదు. అప్పుడు రెండు రకాలుగా టాలీవుడ్ స్టార్లు ఇరుక్కోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందు ముందు డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.  
 

టాప్ హెడ్ లైన్స్

జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget