News
News
X

By Elecctions EC : ఉపఎన్నికలపై హఠాత్తుగా మనసు మార్చుకున్న ఈసీ ! తెర వెనుక ఏం జరిగింది ?

ఉరుములేని పిడుగులా ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వాయిదా వేసినట్లుగా ప్రకటించిన 24 రోజుల్లోనే మనసు మార్చుకుంది.

FOLLOW US: 
 


తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్, బద్వేలు ఉపఎన్నికల నోటిఫికేషన్ ఉరుము లేని పిడుగులా వచ్చి పడింది. ఇప్పుడల్లా రాదని ఏదైనా ఉంటే పండగ సీజన్ అయిపోయిన తర్వాతే వస్తుందని అందరూ సిద్ధమైపోయారు. పండగ సీజన్ అంటే కనీసం దీపావళి అయిపోవాలని అనుకున్నారు. కానీ పండగలు అయిపోక ముందే ప్రచారం హోరెత్తించేలా షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎందుకు ఇంత హడావుడిగా షెడ్యూల్ ప్రకటించింది..? ఇంత మాత్రం దానికే వాయిదా అనే నిర్ణయాన్ని గతంలో ఎందుకు తీసుకున్నారు ? ఇప్పుడివే అందరిలోనూ ఉన్న సందేహాలు. 

సెప్టెంబర్ 4నే వాయిదా అని చెప్పిన ఈసీ ! 

24 రోజుల కిందట అంటే సెప్టెంబర్ 4వ తేదీన ఈసీ కీలకమైన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఒడిషా, బెంగాల్ మినహా అన్ని చోట్లా ఎన్నికలను వాయిదా వేస్తున్నామని చెప్పింది. దీనికి కారణంగా  ఒరిస్సా, బెంగాల్ మినహా ఉపఎన్నికలు జరగాల్సిన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా పరిస్థితులు, పండుగల సీజన్ కారణంగా వాయిదా వేయాలని కోరాయి. దీంతో ఎన్నికల సంఘం ఒరిస్సా , బెంగాల్‌లలో మత్రమే ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం అక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. 30వ తేదీన పోలింగ్ జరగనుంది.

Also Read : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..

News Reels

24న రోజుల్లోనే షెడ్యూల్ ప్రకటించేసిన ఈసీ ! 

వాయిదా నిర్ణయం తీసుకుని 24 రోజుల్లోనే మళ్లీ వాయిదా వేసిన చోట ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికలు నిర్వహించాలని మళ్లీ ఆయా ప్రభుత్వాలు కోరాయా లేదా అన్నదానిపై ఈసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయా ప్రభుత్వాలు కోరినందున వాయిదా వేసిట్లుగా చెప్పింది కానీ ఇప్పుడు ప్రకటించడానికి కారణం ఏమిటో చెప్పలేదు. పైగా పండుగ సీజన్ కూడా అయిపోలేదు. ఇంకా దసరా నవరాత్రులు ప్రారంభం కాలేదు. అయినప్పటికీ షెడ్యూల్  ప్రకటించేసింది ఈసీ ఇంత హఠాత్తుగా ప్రకటించడానికి కారణం ఏమిటన్నదానిపై  విస్త్రతంగా చర్చ జరుగుతోంది.

Also Read : గాంధీ జయంతి రోజున పవన్ కల్యాణ్ గాంధీగిరి ! ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ? అడ్డుకుంటుందా ?

వాయిదా ఇప్పుడు ఢిల్లీలోనే కేసీఆర్ - ఇప్పుడూ ఢిల్లీలోనే కేసీఆర్ ! 

గతంలో ఎన్నికలు వాయిదా వేసిన సమయంలోనూ కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన ఆయన దాదాపుగా ఎడెనిమిది రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే ఈసీ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కూడా కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆదివారం, సోమవారం రెండు సార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే ఇందు కోసమే కేసీఆర్ అమిత్ షాతో సమావేశమయ్యారా అన్నదానిపై స్పష్టత లేదు. యాధృచ్చికంగానైనా రెండు సార్లు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు.

Also Read : గుడ్‌న్యూస్! హైదరాబాద్-ముంబయి బుల్లెట్ రైలు కోసం కీలక ముందడుగు

ఈసీ మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటి ? 

పండగ సీజన్ అయిపోయిన తర్వాత ఉపఎన్నికల గురించి ఆలోచిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు.  తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కో స్థానంతో పాటు దేశ వ్యాప్తంగా మూడు, లోక్‌సభ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయి. అందుకే ఒక్క హుజురాబాద్ నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్ ఇచ్చారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఎన్నికల ప్రకటన చేయడానికి బలమైన కారణం ఉండే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అది రాజకీయమా..? లేకపోతే ఇంకేదైనానా అన్నదానిపై రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Watch Video : వరద నీటిలో విశాఖ ఎయిర్‌పోర్ట్.. తీరం దాటినా తప్పని తుపాను ముప్పు!
 
అందరి దృష్టి హుజురాబాద్ పైనే..! 
 
హుజురాబాద్ ఉపఎన్నికలు నేడో రేపో అన్నట్లుగా పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుండి అక్కడ పరిస్థితి అంతే ఉంది. ఈటల సహా అందరూ వెంటనే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తూ తమ ప్రయత్నాలు తాము చేస్తూ వచ్చారు. కానీ ఆలస్యం అయింది. చివరికి యుద్ధానికి నగరా మోగింది.  నవంబర్ రెండో తేదీన జాతకాలు తేలనున్నాయి. 

Watch Video : రాజకీయాల్లోనే కాదు.. కర్రసాములోనూ ఈ మహిళా లీడర్ ప్రదర్శన సూపర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

 

Published at : 28 Sep 2021 11:51 AM (IST) Tags: huzurabad by-elections Election commision EC BUDVEL

సంబంధిత కథనాలు

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

ABP Desam Top 10, 9 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 9 December 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!