Drone Shot Down: పంజాబ్ ఎన్నికల వేళ పాక్ డ్రోన్ కలకలం.. ఆ రెండు ప్యాకెట్లలో ఏముందంటే?
పాకిస్థాన్ నుంచి పంజాబ్ ప్రాంతంలోకి ప్రవేసించిన ఓ డ్రోన్‌పై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు.
పంజాబ్- పాకిస్థాన్ సరిహద్దులో ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. అంజాలా సెక్టార్‌లోని పజ్‌గరైన్ పోస్ట్ సమీపంలో ఈ డ్రోన్‌పై సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కాల్పులు జరిపింది. ఆ డ్రోన్ నుంచి పసుపు రంగులో ఉన్న రెండు ప్యాకెట్లు జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు.
Punjab | Today at about 12:50 am, troops in Panjgrain heard buzzing of suspected flying object coming from Pakistan side to India. Troops fired upon the drone. During search in village Ghaggar & Singhoke, 2 packets of yellow colour with suspected contraband recovered so far: BSF pic.twitter.com/sir6M1oJzZ
— ANI (@ANI) February 9, 2022
పాక్ కుట్ర..
మంగళవారం అర్ధరాత్రి పంజ్‌గ్రైన్ ప్రాంతంలో డ్రోన్ శబ్దం రావడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఆ సమయంలో ఓడ డ్రోన్ పాకిస్థాన్ నుంచి భారత్ ప్రాంతంలోకి రావడాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో ఆ డ్రోన్‌పై కాల్పులు జరిపి అనంతరం గాలింపు చేపట్టారు.
అమృత్‌సర్ జిల్లాలోని గుర్‌దాస్‌పుర్ సెక్టార్కు 2700 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఘగ్గర్, సింఘోక్ గ్రామాల్లో జాగిలాలతో బలగాలు అన్వేషించాయి.
రెండు వస్తువులు..
ఈ గాలింపులో జవాన్లకు పసుపు రంగులో ఉన్న రెండు ప్యాకెట్లు దొరికాయి. వీటిలో డ్రగ్స్ ఉన్నయనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పంజాబ్ సరిహద్దులో ఇలాంటి డ్రోన్ ఘటన తొలిసారి కాదు. జనవరిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగనున్నాయి. ముందుగా ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. కానీ గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీని మార్టాలని వివిధ పార్టీలు డిమాండ్ చేయడంతో ఈసీ ఫిబ్రవరి 20కి పోలింగ్ తేదీ మార్చింది.
Also Read: Kerala Trekker Rescued: ఆ కేరళ ట్రెక్కర్ సేఫ్, ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ Watch Video