Suspended Meals : సస్పెండెడ్ మీల్స్, కాఫీల గురించి విన్నారా ? ఆకలి తీర్చే ఈ కాన్సెప్ట్ మన దగ్గర చాలా అవసరమే !
Suspended coffee : విదేశాల్లో ముఖ్యంగా యూరప్‌లో సస్పెండెడ్ కాఫీ, మీల్స్ అనే బోర్డులు బయట హోటళ్ల దగ్గర ఉంటాయి. అసలు సస్పెండెడ్ మీల్స్, కాఫీలు అంటే ఏమిటి ?
Do you know about suspended meals : సస్పెండెడ్ కాఫీ.. సస్పెండెడ్ మీల్స్ అనే పదాలు కొత్తగా ఉంటాయి. కాఫీని.. మీల్స్‌ను సస్పెండ్ చేస్తారా అని తెలియని వాళ్లు ఆశ్చర్యపోతారు. కానీ ఇందులో ఉన్న మానవత్వం గురించి తెలిస్తే మాత్రం.. ఇంత మంచి వాళ్లు ఉంటారా అని ఆశ్చర్యపోతారు.
కొన్ని యూరప్ దేశాల్లో ప్రముఖ రెస్టారెంట్లతో పాటు చిన్న చిన్న రెస్టారెంట్లలో కొంత మంది ఐదు కాఫీలకు.. లేదా రెండు మీల్స్‌కు డబ్బులు కట్టి.. రెండు, మూడు కాఫీలు.. ఒక మీల్స్ మాత్రమే తీసుకుంటారు. మిగతా వాటిని సస్పెండెడ్ ఖాతాలో వేయమని చెబుతారు. అంటే టూ కాఫీ .. వన్ సస్పెండెడ్ అని చెప్పి ఒక్క కాఫీ తాగి వెళ్లిపోతారు. అలాగే మీల్స్ చేసే వాళ్లు కూడా ఉంటారు. ఇలా ఆయా హోటళ్లలో సస్పెండెడ్ కాఫీలు, మీల్స్ కౌంట్ పెరుగుతూ ఉంటుంది.
గోపీచంద్ సినిమాలో మాత్రమే కాదు నిజంగానే బాంబే బ్లడ్ గ్రూప్ ఉంది - పది వేల మందిలో ఒకరికే !
మరి వీటినేం చేస్తారు ?. అక్కడే ఉంది ఈ విధానం అసలు కాన్సెప్ట్. ఎంత ధనిక దేశం అయినా పేదలంటారు.. నిరుపేదలంటారు. రోజు గడవని వారుంటారు. ఎవరూ లేని అానాథ వృద్ధులంటారు. అలాగే అప్పటికి చేతిలో డబ్బులు లేని వ్యక్తులు కూడా ఉంటారు. వారు ఇలాంటి హోటల్స్ దగ్గరకు వచ్చి ఎనీ సస్పెండెడ్ కాఫీ లేదా మీల్స్ ఉన్నాయా అని అడుగుతారు. ఆ హోటల్ దగ్గర ఉంటే... యస్ అని చెప్పి వారికి కావాల్సినవి ఇస్తారు. డబ్బులు తీసుకోలేరు. అంటే.. ఇతరులు సస్పెండెడ్ కాఫీలకు డబ్బులు కట్టి వెళ్తే.. డబ్బులు లేని వ్యక్తులు వచ్చి తాగుతారన్నమాట. అలాగే ఆకలి అయిన వారు ఆకలి తీర్చుకుంటారన్నమాట.
యూరప్‌లో వందేళ్ల నుంచి ఈ విధానం ఉందని.. చెబుతూంటారు. ఇది ఎలా పుట్టిందో రకరకాల కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఎలా ఉన్నా.. డబ్బులు లేని వాళ్లు మాత్రమే... ఈ సస్పెండెడ్ కాఫీ లేదా మీల్స్ ను ఉపయోగించుకుంటారు. ఇతరులు ... డబ్బులు మిగుల్చుకుందామని.. ఇలాంటి పేరుతో వీటీని ఉపయోగించుకుంటే.. మొత్తం కాన్సెప్ట్ చెడిపోతుంది. ఆయా దేశాల్లో ప్రజలు కూడా.. బాధ్యతాయుతంగా ఉంటారు కాబట్టే.. ఈ విధానం ఇంకా విజయవంతంగా కొనసాగుతోందని అనుకోవచ్చు.
చెన్నై వెళ్లి స్టాలిన్ ఎవరో తెలియదన్న మనుబాకర్ - ఇక తమిళియన్స్ ఊరుకుంటారా ?
నిజానికి మన దేశంలో చాలా మంది మానవతా వాదులు.. ఆకలితో అలమటింటే నిస్సహాయాలకు భోజనం పెట్టించాలనుకుంటారు. ఎవరికీ డబ్బులివ్వాలనుకోరు. అలాంటి వారికి ఈ సస్పెండెడ్ మీల్స్ విధానం బాగుంటుంది. కానీ మన దేశంలో జేబులో డబ్బులున్నా సరే ఊరకనే వస్తే తినే వాళ్లకు లోటు ఉండదు. అందుకే... ఈ విధానం పెద్దగా మన దగ్గర వర్కవుట్ కాదు.. కానీ ఉంటే మాత్రం.. చాలా మంది నిరుపేదలు.. వృద్ధులకు తోటి వారు సాయం చేస్తారు.