Bombay Blood Group : గోపీచంద్ సినిమాలో మాత్రమే కాదు నిజంగానే బాంబే బ్లడ్ గ్రూప్ ఉంది - పది వేల మందిలో ఒకరికే !
Blood Group : ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్.. బాంబే బ్లడ్ గ్రూప్. పది వేల మందిలో ఒకరికే ఉంటుంది. అత్యంత అరుదైన ఈ రకం రక్తం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంక్వయిరీలు ఉంటాయి.
Bombay Blood Group Only 1 in 10,000 Indians : చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన సినిమా ఒక్కడున్నాడులో హీరో బాంబే బ్లడ్ గ్రూప్‌నకు చెందిన వ్యక్తి. హీరోని చంపి అతని గుండెను తనకు అమర్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే.. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న మరో వ్యక్తి దొరకడం కష్టం కాబట్టి. నిజానికి ఆ సినిమా వచ్చినప్పుడు చాలా మంది బాంబే బ్లడ్ గ్రూప్ అనేది ఉండదని.. అది సినిమాటిక్ క్రియేషన్ అనుకున్నారు. ఆ కథ క్రియేషనే కానీ.. బాంబే బ్లడ్ గ్రూప్ అనేది నిజంగానే ఉంది.
మనం బ్లడ్ బ్యాంకులకు వెళ్లినా ఆస్పత్రులకు వెళ్లినా ఎక్కడా ..బాంబే బ్లడ్ గ్రూప్ అనేది కనిపించదు. అందుకే ఎక్కువ మంది అలాంటివేమీ లేదనుకుంటారు. కానీ అత్యంత అరుదైన గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్. పది వేల మందిలో ఒక్కరికే ఉంటుంది. నిజానికి ఈ గ్రూపును గుర్తించడం కూడా చాలా కష్టం. బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి టెస్టులు నిర్వహించినప్పుడు ఏ , బీ, హెచ్ ఎంటిజెన్ కనిపించదు. అందుకే వీరికి ఓ గ్రూపు అని సర్టిఫై చేస్తూంటారు. కానీ మరింత లోతుగా పరిశీలన చేస్తే అసలు బాంబే బ్లడ్ గ్రూపు గురించి క్లారిటీ వస్తుంది.
బ్లడ్ గ్రూపులన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. కానీ ఈ ఒక్క దానికి మాత్రమే బాంబే బ్లడ్ గ్రూప్ గా పిలుస్తారు. దీనికి కారణం... ఈ రకం రక్తం గ్రూపును బాంబేలోనే గుర్తించారు. ఇప్పుడు ముంబైగా ఆ సిటీ మారింది కానీ.. ఆ పేరు మాత్రం బాంబే బ్లడ్ గ్రూపుగానే రికార్డుల్లో నమోదయింది. వైఎం బెండె అనే వైద్యు నిపుణుడు 1952లో ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు. మరో కారణం కూడా ఉంది. ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వారు ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. వంశపారంపర్యంగా బాంబేబ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశం ఉండంతో అది పెరుగుతోంది. పరీక్షలు చేసే సామర్థ్యం పెరగడంతో బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. ప్రతి పదివేల మందిలో ఒకరికి గ్రూపు రక్తం ఉన్నట్లుగా గుర్తించారు.
బాంబే బ్లడ్ గ్రూపు రక్తాన్ని ఇతర బ్లడ్ లాగా సంరక్షించడం కుదరదు. మహా అయితే నలభై ఐదు రోజులు మాత్రమే.. సంరక్షించగలరు. 'క్రయో ప్రిజర్వేషన్' అనే ఒక టెక్నిక్ ద్వారా ఆ రక్తాన్ని ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసే ప్రయత్నాలు చేశారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఒక్క మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ బాంబే బ్లడ్ గ్రూపు ఉఅన్న వారు ఉంటారు. అందుకే.. ఈ గ్రూపు రక్తం ఉన్న వారికి మెడికల్ పరంగా మంచి డిమాండ్ ఉంటుంది. అవసరమైన వారికి మాత్రమే రక్తదానం చేయాలని వారికి సూచిస్తున్నారు.
అయితే ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉండటం... గొప్ప కాదు. చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. ఎప్పుడైనా అవసరమైతే అసలు దొరకదు మరి.