Maharashtra Politics: నవాబ్ X ఫడణవీస్.. 'మహా' రాజకీయంలో బాంబుల మంటలు
మహారాష్ట్రలో రాజకీయంలో మాటల దాడులు పెరిగాయి. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ హైడ్రోజన్ బాంబు లాంటి వార్త చెబుతానని మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు.
ముంబయి డ్రగ్స్ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పటి నుంచి మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రోజుకో బాంబు పేల్చుతున్నారు. అయితే ఈ మాటల బాంబులు చివరికి మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను కూడా తాకాయి. దీంతో ఫడణవీస్.. నవాబ్ మాలిక్‌కు అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయంటూ దీపావళి బాంబు పేల్చారు.
Mr Nawab Malik,
— @OfficeOfDevendra (@Devendra_Office) November 9, 2021
WHY DID YOU DO BUSINESS WITH THE KILLERS OF MUMBAI ❓❓❓: @Dev_Fadnavis #DevendraFadnavis pic.twitter.com/da8k0OofmD
దీనిపై స్పందించిన నవాబ్ మాలిక్.. తాను రేపు భాజపా నేతపై హైడ్రోజన్ బాంబు వదులుతానని పేర్కొన్నారు.
Mumbai | I will drop a hydrogen bomb tomorrow in connection with Devendra Fadnavis. I will expose Devendra Fadnavis' underworld links: Maharashtra minister Nawab Malik pic.twitter.com/gqiyel94Lw
— ANI (@ANI) November 9, 2021
ఏం చెబుతారు?
దేవేంద్ర ఫడణవీస్‌కు అండర్ వరల్డ్‌తో ఉన్న సంబంధాలను తాను బయటపెడతానని నవాబ్ మాలిక్ అన్నారు. ముంబయి పేలుళ్ల దోషులతో తనకు సంబంధాలున్నాయని చెప్పి.. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేశారని నవాబ్ మాలిక్ ఆరోపించారు. త్వరలోనే వారికి లీగల్ నోటీసులు పంపుతానని మాలిక్ అన్నారు.
నవాబ్‌పై కేసు..
డ్రగ్స్ కేసు దర్యాప్తు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై మాలిక్ పలు ఆరోపణలు చేశారు. దీంతో వాంఖడే కుటుంబం ఆయనపై పరువునష్టం దావా వేసింది. నవాబ్ మాలిక్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే ఓషివారా డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: COVID Vaccination Certificate: భారత్ టీకాలు తీసుకున్నారా బేఫికర్.. ఆ 96 దేశాలకు ఇక బ్యాగ్ సద్దేయండి!
Also Read: Farmer Protest Tractor March: పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మార్చ్.. రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతం
Also Read: Padma Awards 2021: పండ్ల వ్యాపారికి పద్మశ్రీ.. వాట్ ఏన్ ఐడియా బాబాయ్.. నీకు 'దేశం' సలాం!
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి