అన్వేషించండి

Keralam Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !

Keralam Elections: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేరళలో సుడిగాలి పర్యటనలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అగ్రనేతలను బీజేపీ వ్యూహాత్మక ప్రచారంలోకి దింపుతోంది.

Keralam Assembly Elections Devendra Fadnavis: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ  తన వ్యూహాలకు పదును పెడుతోంది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత కేరళను తన తదుపరి లక్ష్యంగా మార్చుకున్న కమలదళం, ఈసారి  మిషన్ కేరళ'  పేరుతో అత్యంత పకడ్బందీగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా  యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూనే, జాతీయ స్థాయి దిగ్గజాలను క్షేత్రస్థాయి ప్రచారంలోకి దించుతూ ప్రత్యర్థి పార్టీలైన ఎల్‌డిఎఫ్ , యుడిఎఫ్ లకు సవాల్ విసురుతోంది.

 ఫడ్నవీస్ ప్రచారం - ఎర్నాకులంపై ప్రత్యేక దృష్టి 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేరళలో సుడిగాలి పర్యటనలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తాజాగా ఎర్నాకులం జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని, కేరళ అభివృద్ధికి మోదీ నాయకత్వమే శరణ్యమని ఉద్ఘాటించారు. ఎర్నాకులంను  ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారుస్తామని హామీ ఇస్తూ, స్థానిక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కేరళలో కేవలం ఓట్లు పెంచుకోవడమే కాకుండా, ఈసారి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.  

 విష్ణువర్ధన్ రెడ్డి సమన్వయం - క్షేత్రస్థాయిలో మకాం 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు  విష్ణువర్ధన్ రెడ్డి  గత మూడు, నాలుగు వారాలుగా కేరళలోనే మకాం వేసి, ఎర్నాకులం జిల్లా ఇంచార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ నేతల పర్యటనలను సమన్వయం చేయడంతో పాటు, స్థానిక కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఎర్నాకులం జిల్లాలోని త్రిపునిత్తుర ఎన్డీయే అభ్యర్థి అంజలి నాయర్,  ఇతర అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును పెంచేందుకు కృషి చేస్తున్నారు.

 జాతీయ నేతల అండ - గెలుపుపై ధీమా 

కేరళలో ఈసారి బిజెపి అగ్రనేతలంతా రంగంలోకి దిగుతున్నారు. జె.పి. నడ్డా, స్మృతి ఇరానీ వంటి నేతలు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. గతంలో త్రిపుర, అస్సాంలలో బిజెపి ఎలాగైతే అసాధ్యమైన విజయాలను సాధించిందో, కేరళలో కూడా అదే చరిత్ర పునరావృతమవుతుందని బిజెపి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి హామీలతో బిజెపి ఈసారి గట్టి పోటీనిస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
CM Chandrababu: వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
CM Chandrababu: చాయ్ విక్రేత నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ: కెపాసిటీ బిల్డింగ్‌కు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు
చాయ్ విక్రేత నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ: కెపాసిటీ బిల్డింగ్‌కు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget