అన్వేషించండి

Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!

TVK: తిరుత్తణి నియోజకవర్గ టీవీకే అభ్యర్థి సత్యకుమార్‌ వెంట ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండటం లేదు. కార్యకర్తలు రావడంలేదు. కనీసం ఆయన అనుచరులు కూడా ఎవరూ లేరు.

TVK Thiruthani candidate: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీలో టికెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. తిరుత్తణి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడిన అడ్వకేట్ సత్యకుమార్  తీరుపై స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆయనతో ప్రచారానికి వెళ్లడంలేదు.  

నేతల సామూహిక బహిష్కరణ                            

తిరుత్తణి నియోజకవర్గ టీవీకే అభ్యర్థి సత్యకుమార్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా కార్యదర్శితో సహా నగర, మండల స్థాయి నాయకులందరూ ప్రచారాన్ని బహిష్కరించారు. విజయ్ పార్టీ తరపున బరిలోకి దిగిన సత్యకుమార్,  నామినేషన్ వేసే సమయంలో పార్టీ నేతలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఒంటరిగా వెళ్లి పత్రాలు సమర్పించడం స్థానిక కేడర్‌కు ఆగ్రహం తెప్పించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన అభ్యర్థి తమకు వద్దంటూ వందలాది మంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

 వివాదాస్పద వ్యాఖ్యలు - కరువైన మద్దతు                             

సత్యకుమార్ గతంలో తిరుత్తణి యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు శాపంగా మారాయి. ఇక్కడి యువత అంతా గంజాయి బ్యా అని, వారికి కనీసం చదవడం, రాయడం కూడా రాదని ఆయన కించ పరిచేలా మాట్లాడారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతాన్ని, యువతను అవమానించిన వ్యక్తికి తాము ఓట్లు ఎలా అడుగుతామని వారు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థిని తక్షణమే మార్చకపోతే తాము ఎన్నికల పనులకు దూరంగా ఉంటామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.

 ఒంటరి పోరాటం - సోషల్ మీడియాలో వైరల్ 

పార్టీ శ్రేణుల మద్దతు కరువవ్వడంతో సత్యకుమార్ గత్యంతరం లేక తిరుత్తణి రోడ్లపై ఒంటరిగా ప్రచారం మొదలుపెట్టారు. చేతిలో పార్టీ జెండా పట్టుకుని, దారిలో వెళ్లే వాహనదారులను, వ్యాపారులను ఆపి తనకు ఓటు వేయాలని అర్థించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకప్పుడు విజయ్ పార్టీ అభ్యర్థి అంటే భారీ ఊరేగింపులు ఉంటాయని ఆశించిన జనానికి, అభ్యర్థి ఇలా ఒంటరిగా రోడ్డుపై నిలబడి ఉండటం   కనిపిస్తోంది.   

విజయ్ నిర్ణయంపై ఉత్కంఠ 

పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనే ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడటం టీవీకే వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఇతర నియోజకవర్గాల్లో విజయ్ క్రేజ్‌తో పార్టీ దూసుకుపోతుంటే, తిరుత్తణిలో మాత్రం పరిస్థితి రివర్స్ అయ్యింది. మరి ఈ నిరసనలతో విజయ్ తన అభ్యర్థిని మారుస్తారా? లేక సత్యకుమార్‌తోనే ముందుకు వెళ్తారా? అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.      

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget