అన్వేషించండి

Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?

TVK chief Vijay: టీవీకే చీఫ్ విజయ్ దాఖలు చేసిన రెండు అఫిడవిట్లు వివాదాస్పదమయ్యాయి. ఓ దాంట్లో కేసులు ఉన్నాయని..మరో దాంట్లో లేవని చెప్పడంతో నామినేషన్ల చెల్లుబాటుపై సందేహాలు ప్రారంభమయ్యాయి.

Differences in Vijay nomination affidavits: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం  అధినేత  విజయ్ తన తొలి ఎన్నికల బరిలో వేసిన నామినేషన్లు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన రెండు నియోజకవర్గాల  చెన్నైలోని పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీకి దిగడమే కాకుండా, ఆ రెండు చోట్లా సమర్పించిన అఫిడవిట్లలో పరస్పర విరుద్ధమైన సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా క్రిమినల్ కేసుల విషయంలో ఆయన వెల్లడించిన వివరాలు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారాయి.                 

విజయ్ తన రాజకీయ అరంగేట్రంలో భాగంగా చెన్నైలోని  పెరంబూరు , తిరుచ్చిలోని  తిరుచ్చి ఈస్ట్   రెండు నియోజకవర్గాల నుండి నామినేషన్లు వేశారు. అయితే, పెరంబూరు నియోజకవర్గంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని  పేర్కొన్న విజయ్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం కోసం సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం తనపై ఒక  కేసు పెండింగ్‌లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు. 2025లో నమోదైన ఒక కేసు వివరాలను తిరుచ్చి అఫిడవిట్‌లో పొందుపరిచి, పెరంబూరులో మాత్రం దాన్ని దాచిపెట్టడం లేదా మర్చిపోవడం ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదమైంది. ఒకే అభ్యర్థి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో వేర్వేరు సమాచారంతో కూడిన అఫిడవిట్లు ఇవ్వడం ఎన్నికల నియమావళి ప్రకారం తప్పిదమని, ఇది ఆయన నామినేషన్ చెల్లుబాటుపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు, ప్రత్యర్థి పార్టీలు విశ్లేషిస్తున్నాయి.                                         
   
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడం తీవ్రమైన నేరం కావడంతో, ఈ అంశం ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నామినేషన్లు చెల్లకపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.    విజయ్ ఆస్తుల విలువ *రూ. 625 కోట్లు గా వెల్లడవ్వడం, అందులో తన భార్య సంగీతకు ఆయన ఇచ్చిన రూ. 12.6 కోట్ల అప్పు వివరాలు కూడా ఉండటం చర్చనీయాంశం అయింది.          

విజయ్ 1992లో చెన్నైలోని లయోలా కాలేజీలో బీఎస్సీ డిస్కంటిన్యూ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన గ్యారేజీలో బీఎండబ్ల్యూ i7, టయోటా లెక్సస్ వంటి అత్యాధునిక లగ్జరీ కార్లతో పాటు, ఒక టీవీఎస్ ఎక్స్‌ఎల్  మోపెడ్ కూడా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొత్తం మీద, తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న విజయ్ ఆస్తుల వివరాలు . వ్యక్తిగత జీవితానికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.  


  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget