అన్వేషించండి

Tamil Nadu Assembly Elections BJP: తమిళిసైకు టిక్కెట్ - అన్నామలైకు నో టిక్కెట్ - తమిళనాట బీజేపీ ప్రయోగాలు

Tamil Nadu BJP: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అన్నామలైకు టిక్కెట్ దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Annamalai no Contest : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 నేపథ్యంలో బీజేపీ తన 27 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా పార్టీ గొంతుకగా నిలిచిన అన్నామలై  పేరు ఈ జాబితాలో లేకపోవడం, ఆయన స్థానంలో ఇతర హేమాహేమీలకు చోటు కల్పించడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.  

అన్నామలై ఎందుకు తప్పుకున్నారు? 

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వెనుక సీట్ల కేటాయింపుపై ఉన్న అసంతృప్తి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఏఐఏడీఎంకే  నేతృత్వంలోని కూటమిలో బీజేపీకి కేటాయించిన 27 సీట్ల విషయంలో అన్నామలై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తనకు పట్టున్న కోయంబత్తూర్ రీజియన్‌లోని  సింగనల్లూర్', గౌండంపాలయం  స్థానాలను ఏఐఏడీఎంకే ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీనిపై పార్టీ జాతీయ నాయకత్వానికి తన  తీవ్ర అసంతృప్తి ని వ్యక్తం చేస్తూ, తాను పోటీకి దూరంగా ఉండి కేవలం ఒక కార్యకర్తగా ప్రచారం చేస్తానని ప్రకటించారు.

 హేమాహేమీల ఎంపిక - విజయమే లక్ష్యం 

పార్టీ రాష్ట్ర నాయకుడు వినోజ్ పి. సెల్వం కేవలం గెలుపు గుర్రాలనే బీజేపీ బరిలోకి దించినట్లు ప్రకటించారు.  కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ అవనాశి (SC) నుండి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని మైలాపూర్ నుండి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు వానతి శ్రీనివాసన్  కోయంబత్తూర్ నార్త్ ,  నైనార్ నాగేంద్రన్ సాత్తూర్  వంటి  చోట్ల పోటీ చేస్తున్నారు.  అనుభవం, నియోజకవర్గాలపై పట్టున్న వారికే ప్రాధాన్యత ఇచ్చామని, ఈ 27 మంది భారీ మెజారిటీతో గెలుస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 

టికెట్ దక్కని వారి అసంతృప్తి - నిరసనలు  

జాబితా ప్రకటన తర్వాత బీజేపీలో కొన్ని చోట్ల అసమ్మతి సెగలు రేగాయి. సీట్ల పంపకంలో ఏఐఏడీఎంకే పెత్తనం సాగించిందని, బీజేపీ ఎదుగుతున్న నియోజకవర్గాలను కాకుండా బలహీనంగా ఉన్న స్థానాలను కేటాయించారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుప్పరంకుండ్రం వంటి కీలక స్థానాల్లో బీజేపీకి చోటు దక్కకపోవడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. అన్నామలై లాంటి ఫైర్ బ్రాండ్ నేత బరిలో లేకపోవడం వల్ల క్యాడర్‌లో ఉత్సాహం తగ్గే ప్రమాదం ఉందని  బీజేపీ క్యాడర్ భావిస్తున్నారు.    

మహిళా శక్తికి పెద్దపీట 

ఈసారి బీజేపీ మహిళా అభ్యర్థులకు గణనీయమైన ప్రాధాన్యత ఇచ్చింది. తమిళిసైతో పాటు కీర్తిక శివకుమా , కవితా శ్రీకాంత్, విజయధారణి**  వంటి  హిళా నేతలను గెలుపు అవకాశాలున్న చోట బరిలోకి దించింది. ఇది మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు.  అన్నామలై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, పార్టీ హైకమాండ్ మాత్రం ఏఐఏడీఎంకేతో పొత్తు దెబ్బతినకుండా జాగ్రత్త పడింది.  ప్రస్తుతానికి కూటమి ముఖ్యం, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి తమిళనాడులో బలమైన శక్తిగా ఎదగాలంటే ప్రాంతీయ పార్టీతో కలిసి నడవక తప్పదు అనేది ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే అన్నామలైని రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పరిమితం చేసి, ఆయన ఛరిష్మాను అన్ని నియోజకవర్గాల్లో వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget