CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం
Cyclone Michaung News in Telugu: రాష్ట్రంలో మిగ్‌జాం తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
CPI leader Ramakrishna: రాష్ట్రంలో మిగ్‌జాం తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తుపాను వల్ల పొలాలలో నష్టపోయిన పంటను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టేజీలు వేసుకొని క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 460 మండలాలలో తీవ్రమైన కరువు తాండవిస్తుంటే కేవలం 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణం అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశంగా ముందుకు వెళ్తుందని విమర్శించారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కరువును చూడలేని వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఏ విధంగా ఆదుకుంటారని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. తుఫాను కారణంగా రైతుల పొలాల్లో దాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కనీసం రైతులతో కూడా మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదని.. కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించకపోవడంతోనే అన్నమయ్య ప్రాజెక్టు వరదలు కొట్టుకపోయిందన్నారు. దాని పర్యవసానంగానే 39 మంది మృతి చెందారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని... ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో తాను ఎప్పుడూ చూడలేదు అన్నారు. తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని.. తుపాను బాధితుల నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.