(Source: ECI/ABP News/ABP Majha)
Corona Cases: తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్క రోజే 29 మంది మృతి!
Corona Cases: రెండ్రోజులుగా తగ్గినట్టే తగ్గిన కోరనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈ ఒక్కరోజే 9 వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 29 మంది మృతి చెందారు.
Corona Cases: గత రెండ్రోజుల వరకు దేశంలో కోరనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టగా.. మరోసారి పెరుగుతున్నాయి. మంగళవారం రోజు 7 వేల కేసులు నమోదు కాగా.. నేడు 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 44 శాతం ఎక్కువ. కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ వారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,79,031 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 9 వేల 629 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం దేశంలో 61 వేల 13 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో 11, 967 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 43 లక్షల 23 వేల 45కు చేరింది.
కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో మొత్తం 29 మంది చనిపోయారు. కేళలో 10 మంది, ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్ర, రాజస్థాన్ లో ముగ్గురు చొప్పు, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరు చొప్పున, ఒడిశా, గుజరాత్, చత్తీస్ గఢ్ ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 31 వేల 398 కి చేరింది. అలాగే ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.41 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వివరించింది.