అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: కాంగ్రెస్ మద్దతు అడిగిన విజయ్ - ఎమ్మెల్యేలకే వదిలేసిన రాహుల్ - డీఎంకేకు షాకిచ్చినట్లే!?

Tamil Nadu :తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్‌కు కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ప్రతిపాదన పంపారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

Congress likely to support Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం , ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ మద్దతు కోరింది.  ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో , టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి అధికారికంగా ప్రతిపాదన పంపారు.

ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. విజయ్ ఆహ్వానాన్ని తాము చర్చించామని, అయితే మద్దతు ఇవ్వాలా వద్దా అనే తుది నిర్ణయాన్ని తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కే వదిలేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో లౌకిక విలువలను కాపాడే ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఆశయమని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ విషయంలో స్థానిక నేతల అభిప్రాయాలు, రాష్ట్ర రాజకీయ సమీకరణాలను బట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.  

తమిళనాడులో రాజ్యాంగాన్ని అక్షరాలా రక్షించే ఒక లౌకిక ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆశయానికి కట్టుబడి ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఏ రూపంలోనైనా సరే.. బీజేపీ లేదా వారి ప్రతినిధులు  తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపించడాన్ని కాంగ్రెస్ సహించబోదని ఆయన తేల్చి చెప్పారు.  రాష్ట్రంలో ఎన్నికల తీర్పు ద్వారా వ్యక్తమైన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, విజయ్ విజ్ఞప్తిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా టీఎన్‌సీసీ నాయకత్వాన్ని ఆదేశించాం  అని వేణుగోపాల్ వెల్లడించారు. 107 సీట్లు ఉన్న విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, కాంగ్రెస్ మద్దతు అత్యంత కీలకం కానుంది. బీజేపీని రాష్ట్ర అధికారానికి దూరం ఉంచాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ, విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే టీఎన్‌సీసీ నేతలు సమావేశమై దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో బలమైన మిత్రపక్షంగా ఉంది. అయితే తాజా ఎన్నికల్లో డీఎంకే కూటమి వెనుకబడటం, విజయ్ పార్టీ పుంజుకోవడంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది.  కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 5 స్థానాలను గెలుచుకుంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు అనివార్యంగా మారింది.  కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ వంటి నేతలు స్పందిస్తూ.. తాము ఎప్పుడూ అవకాశవాద రాజకీయాలు చేయబోమని, సిద్ధాంత పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. తమిళనాడులో  దళపతి  విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలంటే ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది. స్థానిక కాంగ్రెస్ నేతలు విజయ్‌కు మద్దతు తెలిపితే, తమిళ రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా ఉన్న డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వైపాక్షిక రాజకీయానికి తెరపడి, కొత్త శకం ప్రారంభమవుతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget