Maoist vaarotsavalu: వారం రోజుల పాటు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండి - మావోయిస్టు కేంద్ర కమిటీ
Maoist vaarotsavalu: జులై 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు అమరుల సంస్మరణ వారాన్ని పాటించమంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖను విడుదల చేసింది.
Maoist vaarotsavalu: ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవారు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండి అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. భారత విప్లవ కారులు మహోపాధ్యాయులు, మావోయిస్టు పార్టీ సంస్థాపక నాయకులు కామ్రేడ్ చారు ముజుందార్ 50వ వర్ధంతి, కామ్రేడ్ కన్హాయ్ చటర్జీ 40వ వర్ధంతిలను వారోత్సవాలుగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ వారోత్సవాలను గొప్ప విప్లవ స్ఫూర్తి, సంకల్పంతో నిర్వహించాలని కోరారు. భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో శత్రువు వ్యూహాత్మక "సమదాన్ ప్రహర్ " దాడిని ఓడించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపును ఇచ్చింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అన్ని కేడర్లవారు ఈ వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ లేక విడుదల చేసింది.
వారోత్సవాల నిర్వీర్యం కోసం పోలీసుల చర్యలు..
మరోవైపు మావోయిస్టు వారోత్సవాల నిర్వీర్యం కోసం పోలీసులు ముందుస్తు చర్యలు తీస్కుంటున్నారు. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాలలోని అన్ని పట్టణాలలో, గ్రామాలలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏపీలోని అరకులోయ పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు పికిటింగ్ తో పాటు, సంఘ విద్రోహుల ప్రతి చిన్న కదలికలపై డేగ కన్ను వేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అరకలోయ, అనంతగిరి డుబ్రిగూడ మండలాలలోని పోలీసులు స్టేషన్ లో పరిధిలో అన్ని విధాలా అప్రమత్తత ప్రకటించినట్టు పేర్కన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు, అటవీ సమీప ప్రాంతాల్లోనూ, పట్టణంలోనూ పోలీసులు ప్లాగ్ మార్చి నిర్వహించారు.
ఏమాత్రం అనుమానం వచ్చినా చెప్పండి..
అన్ని వీధులలో పోలీసులు కలియ తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎలాంటి సంఘం విద్రోహ శక్తుల గ్రామాలు, పల్లెల్లో కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరిపైనైనా కొంచెం అనుమానం కల్గినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అరకులోయ పట్టణంలోని క్రైం రేటు అధికంగా గల కొండవీధి ప్రాంతాలలో గంజాయి, సారాయి, గుట్కాలకు బానిసలైన యూత్ ను ఆయన కలసి గతంలో తాము ఇచ్చిన కౌన్సిలింగ్ ఎంతవరకు వారిలో ఫలితాలను ఇచ్చినది, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
రంగంలోకి స్పెషల్ దళాలు..
మావో వారోత్సవాల విజయవంతం కాకుండే దిశగా ప్రత్యేక గ్రేహౌండ్స్ దళాలను, స్పెషల్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలను అరకులో సర్కిల్ పరిధిలో అధిక సంఖ్యలో దించడం జరిగిందని పోలీసులు వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూంబింగ్ ఆపరేషన్లు, రోడ్డు మార్చింగులు, వాహనం తనిఖీలు, అనుమానితులను తనిఖీ చేయడము, ఈ వారం రోజులు ముమ్మరంగా జరుగుతాయనీ ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. ప్రజలకు అన్ని విధాలుగా భరోసా తమ శాఖ కల్పిస్తుదనీ వెల్లడించారు.