ChatGPT Banned: చాట్ జీపీటీ టూల్‌పై బ్యాన్, ప్రైవసీపై అనుమానాలు
ChatGPT Banned: ఇటలీలో చాట్ జీపీటీపై తాత్కాలిక నిషేధం విధించారు.
ChatGPT Banned in Italy:
ఇటలీలో తాత్కాలిక నిషేధం
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్ ChatGPT గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలా వచ్చిందో లేదో...వెంటనే ఫేమస్ అయిపోయింది. గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ టూల్...త్వరలోనే గూగుల్‌ను కొట్టేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే...ఇటలీ ఈ కంపెనీకి షాక్ ఇచ్చింది. తాత్కాలికంగా బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. చాట్ జీపీటీని బ్యాన్ చేసిన తొలి దేశంగా రికార్డుకెక్కింది. ఇటలీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్ కూడా పాస్ చేసింది. ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ChatGPTపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. యూజర్స్ నుంచి అక్రమంగా వివరాలు సేకరిస్తోందని, ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ కూడా లేదని చెబుతోంది. మైనర్లు ఈ టూల్‌ని దుర్వినియోగపరిచే ప్రమాదముందని వాదిస్తోంది. ప్రైవసీ పరంగా ఈ టూల్ అంత సేఫ్ కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం భారత్‌లో ఈ టూల్ అందుబాటులో ఉన్నప్పటికీ...చైనా, నార్త్ కొరియా, రష్యా, ఇరాన్‌లో మాత్రం యాక్సెస్ లేదు. కొంత మంది టెక్ నిపుణులు కూడా దీనిపై తాత్కాలిక నిషేధం విధించడమే బెటర్ అని సూచిస్తున్నారు. డిజిటల్ పాలసీలో సంస్కరణలు తీసుకొచ్చిన తరవాత ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురావడం మంచిదని చెబుతున్నారు. ఈ మేరకు ఇటలీ ఈ విషయంలో ముందడుగు వేసింది.
వార్నింగ్..
ఇటలీలోని రెగ్యులేటర్లు...ఇప్పటికే OpenAI కీలక ఆదేశాలిచ్చింది. దేశంలో ఎవరూ చాట్ జీపీటీ యాక్సెస్ చేయడానికి వీల్లేకుండా నియంత్రించాలని తేల్చి చెప్పింది. ఈలోగా చాట్ జీపీటీ కంపెనీ తమ వాదనలు వినిపించవచ్చని తెలిపింది. ఇందుకోసం 20 రోజుల గడువు ఇచ్చింది. డేటాను అక్రమంగా సేకరించడం లేదని నిరూపించుకుంటే...ఇటలీలో ఈ బ్యాన్ ఎత్తేసే అవకాశముంది. మార్చి 20వ తేదీన డేటా బ్రీచ్ జరిగిందని ఆరోపిస్తోంది ఇటలీ ప్రభుత్వం. కొందరు యూజర్‌ల పేమెంట్ వివరాలు అందరికీ కనిపిస్తున్నాయని, ఇది ప్రైవసీకి భంగం కలిగిస్తోందని వివరిస్తోంది. ఈ తప్పులు దిద్దుకోకపోతే 20 మిలియన్ యూరోల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు చాట్ జీపీటీ కంపెనీ స్పందించింది. ప్రభుత్వ నిబంధనలకు, ప్రైవసీకి కట్టుబడి ఉన్నామని, అందుకే సర్వీస్‌లను ఆపేస్తున్నామని స్పష్టం చేసింది.
చాట్ జీపీటీ అంటే...
గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు వరల్డ్ లో నెంబర్ 1 సెర్చ్ ఇంజన్. మనకి ఏం కావాలన్నా నెట్ లో గూగుల్ తల్లిని అడగటం మొదలు పెట్టాం. ఇప్పుడు గూగుల్ కి పోటీగా ఓ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ పోటీకి వచ్చింది. ఛాట్ బోట్స్ మనకందరికీ తెలుసు. చాలా చోట్ల అప్లికేషన్స్ అన్నీ చాట్ బోట్స్ తోనే రన్ అవుతున్నాయి. అలాంటి దశను దాటుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వచ్చిన ఓ చాట్ బోటే చాట్ జీపీటీ. చాట్ అంటే మాట్లాడటం. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్సఫార్మర్. అంటే ఈ చాట్ బోట్ ను ముందు ట్రైన్డ్ చేస్తారు. ఎప్పటికప్పుడు విషయాలను దీనికి ఇంక్లుడ్ చేయటం ద్వారా ఈ చాట్ జీపీటీ మనకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ప్రభాస్ అంటే ప్రభాస్ ఎవరు ఏంటీ సింపుల్ గా ఓ ముప్పై పదాల్లో చెప్పేస్తుంది. ఏదైనా ప్రాబ్లం దానికి చెప్పామనుకోండి అది మొత్తం సాల్వ్ చేసి ఇస్తుంది.
Open AI అనే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ మీద వర్క్ చేస్తున్న కంపెనీ ఈ చాట్ జీపీటీని లాంచ్ చేసింది.ఒక్క వారంలోనే వన్ మిలియన్ సబ్ స్కైబర్లు వచ్చారు దీనికి. ఈ నెంబర్ అచీవ్ అవ్వటానికి చాలా పెద్ద కంపెనీలకు కూడా చాలా టైమ్ పట్టింది. అందుకే గూగుల్ లాంటివి చాట్ జీపీటీ మీద రెడ్ కోడ్ పెట్టాయి.