Mother Teresa Accounts : మదర్ థెరిసా సేవా సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన కేంద్రం... ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ !
మదర్ థెరిసా ప్రారంభించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్లను కేంద్రం ఫ్రీజ్ చేసింది. ఆపన్నులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
![Mother Teresa Accounts : మదర్ థెరిసా సేవా సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన కేంద్రం... ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ ! Centre Has Frozen Bank Accounts Of Mother Teresa's Missionaries Of Charity: Mamata Banerjee Mother Teresa Accounts : మదర్ థెరిసా సేవా సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన కేంద్రం... ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/a40a09b201d83092e0ff32564289e520_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మదర్ థెరిసా నెలకొల్పిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ కు చెందిన బ్యాంక్ అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. క్రిస్మస్ రోజునే ఆ సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేశాని...ఇది మానవత్వం కాదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ కోల్‌కతా ప్రధాన కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. క్రిస్మస్ పర్వదినం రోజున తమ సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్లు.. నగదు మొత్తం ఫ్రీజ్ చేశారని.. దీని వల్ల 22వేల మందికిపైగా రోగులు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని ఆ సంస్థకు చెందిన కొంత మంది సోషల్ మీడియాలో ట్వీట్ల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
Shocked to hear that on Christmas, Union Ministry FROZE ALL BANK ACCOUNTS of Mother Teresa’s Missionaries of Charity in India!
— Mamata Banerjee (@MamataOfficial) December 27, 2021
Their 22,000 patients & employees have been left without food & medicines.
While the law is paramount, humanitarian efforts must not be compromised.
మదర్ థెరీసా కోల్‌కతాలో ఆపన్నులను ఆదుకునేందుకు కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని ప్రారంభించారు. ఆమె చేసిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరణానంతరం ఆమెకు సెయింట్ హోదా ఇచ్చారు. ఆమె ప్రారంభించిన సంస్థలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే కేంద్రం హఠాత్తుగా ఆ సంస్థ అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి కారణం ఏమిటో అధికారింగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం
కానీ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ విదేశాల నుంచి విరాళాలు సేకరిచేందుకు అవసరమైన నిబంధనల ప్రకారం అనుమతుల రెన్యూవల్ చేసుకోలేకపోయిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చెబుతోంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ ప్రకారం విరాళాలు సేకరించేందుకు అవసరమైన అర్హతలు సాధించలేకపోవడంతో ఆ సంస్థ దరఖాస్తును తిరస్కరించినట్లుగా కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ కారణంగానే మిషనరీస్ ఆఫ్ చారిటీ అకౌంట్లు మొత్తాన్ని ఫ్రీజ్ చేసి ఉంటారని భావిస్తున్నారు.
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
మరో వైపు ఈ నెల పధ్నాలుగో తేదీన గుజరాత్‌లోని వడోదరలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌పై పోలీసులు ఓ కేసు నమోదుచేశారు. పిల్లలను బలవంతంగా మాత మార్పిడి చేస్తున్నారన్న అభియోగాలు మోపారు. సేవా కార్యక్రమాల ముసుగులో బలవంతంగా మత గ్రంధాలు చదివేలా చేస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కొంత కాలం నుంచి మిషనరీస్ ఆఫ్ చారిటీపై మత మార్పిడి ఆరోపణలను కొంత మంది చేస్తున్నారు. గుజరాత్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)