అన్వేషించండి

Privacy Bill : వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు ఉపసంహరణ - కేంద్రం కీలక నిర్ణయం !

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు ను కేంద్రం ఉపసంహరించుకుంది. సవరణలతో మళ్లీ ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది.

 


Privacy Bill :  వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 డిసెంబర్‌ 11న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్‌లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. ప్రజల సమాచార గోప్యతా చట్టానికి సంబంధించిన ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నదని  విపక్షాలు ఆరోపించాయి. 

వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించేలా గతంలో చట్టం

జాతీయ భద్రత, ఇతర కారణాల పేరుతో వ్యక్తుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడానికి ఈ చట్టం ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కల్పిస్తున్నదని విమర్శించాయి.  కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. 

విపక్షాల ఆందోళనలతో జేపీసీకి పంపిన కేంద్రం

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు అనేక సాంకేతిక, విధానపరమైన సమస్యలను సృష్టిస్తుందని ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే, వ్యక్తుల అనుమతి, డేటా నిల్వకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నాయి. ఇంటర్మీడియటరీ హోదా... ఎవరైనా వినియోగదారుడు సదరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకమైన అంశాలను పోస్టు చేసే వాటికి ఈ సోషల్‌ మీడియా సంస్థ బాధ్యత ఉండదు. 

భారీగా సవరణలు సూచించడంతో బిల్లు ఉపసంహరించాలని నిర్ణయం

దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆనాడు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదించారు. 2021 డిసెంబర్‌ 16న ఈ కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. ఈ బిల్లుకు 81 సవరణలను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. పౌరుల డిజిటల్‌ డేటా రక్షణకు సంబంధించిన ఈ బిల్లును చట్టపరంగా సమీక్షించి కొత్తగా తిరిగి ప్రవేశపెడతామని చెప్పారు.
 

టాప్ హెడ్ లైన్స్

Usman Khawaja Scandal:  ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026 LIVE: ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget