అన్వేషించండి

Benefits of Voting: ఓటు వేయండి ఆరోగ్యంగా ఉండండి, బోనస్‌గా మానసిక ఉల్లాసం కూడా

Health Benefits of Voting: ఓటు వేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Casting Vote Boosts Mental Health: ఓటు వేయడం అందరి బాధ్యత, హక్కు. ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే అందరూ విధిగా ఓటు వేయాలి. ఇవన్నీ మనకి తెలిసిన (Health Benefits of Voting) విషయాలే కావచ్చు. అయినా కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తారు. "నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే" అని లైట్ తీసుకుంటారు. కానీ...ఇలా ఓటు వేయడం వల్ల సమాజానికే కాదు. మన ఆరోగ్యానికీ మంచిదని మీకు తెలుసా..? మానసిక ప్రశాంతత కోసం మనం చేసే పనుల్లో ఓటు వేయడం కూడా ఒకటి. కాస్త వింతగా అనిపిస్తుందని కానీ..కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒత్తిడి తగ్గించుకునేందుకు కొందరు మందులు వాడతారు. మరి కొందరు ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. ఇంకొందరు లైఫ్‌స్టైల్‌ని మార్చేసుకుంటారు. కానీ...మన చేతుల్లో ఉన్న వాటిని సరైన విధంగా వినియోగించుకోగలగడమూ మానసిక ఆందోళన తగ్గించే ఔషధమే అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు. అలా మన చేతుల్లో ఉన్నదే ఓటు హక్కు. ఓటు వేయడం వల్ల వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనాలేంటో అర్థం చేసుకుంటే కచ్చితంగా అందరూ ముందుకొచ్చి ఆ హక్కుని వినియోగించుకుంటారు. 

ఎంతో ఊరట..

సాధారణంగా మానసిక వైద్యులు తరచూ ఓ సలహా ఇస్తుంటారు. ఎప్పుడైనా కాస్త మనసు చిరాకుగా అనిపిస్తే అలా బయటకు వెళ్లి రమ్మని చెబుతారు. ఒంటరిగా కూర్చోకుండా నలుగురితో (casting vote boosts mental health) కలవమని సూచిస్తారు. అంటే.. సోషల్ గ్యాదరింగ్ అనేది మనిషికి చాలా ముఖ్యం అన్నమాట. అందుకే పండగలప్పుడు కొన్ని కాలనీల్లో అందరూ కలిసి అన్నదానాలు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు. పోలింగ్ కూడా ప్రజాస్వామ్యంలో ఓ పండగలాంటిదేగా. అందరూ కలిసి పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేయడమూ ఉత్సవం లాంటిదే. అందుకే ఓటింగ్‌తో కూడా మానసిక ఉల్లాసం కలుగుతుందని చెబుతున్నారు (Benefits of Voting) మానసికవేత్తలు. ఓటు వేసే దగ్గర అందరూ సమానమే. పేద, ధనిక అన్న తేడా ఉండదు. ప్రతి ఒక్క ఓటూ విలువైందే. ఇది కూడా కొంత వరకూ మానసికంగా కాస్త ఊరటనిస్తుంది. ఓటు వేయడం అంటే కేవలం అక్కడికి వెళ్లి మీట నొక్కి రావడం కాదు. ఎంతో కొంత ఆ అభ్యర్థి గురించి తెలుసుకుంటారు. లోకల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాజకీయాల నుంచి మనల్ని మనం వేరు చేసుకోకుండా ఇలాంటి వివరాలు తెలుసుకుంటే సమాజంలో ఎంతో కొంత గౌరవం ఉంటుంది. పైగా పొలిటికల్‌గా అభిప్రాయాలు కలిస్తే కొత్త పరిచయాలవుతాయి. వాళ్లే మిత్రులవుతారు. అది కూడా ఓ విధంగా మానసికంగా రిలాక్సేషన్ ఇస్తుంది. 

పిల్లలకీ చెప్పాలి..

ఇక పోలింగ్ బూత్ దగ్గర్లోనే ఉంటే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. మళ్లీ కాలి నడకనే ఇంటికి రావచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో కొంత శరీరంలో క్యాలరీలు తగ్గుతాయి. ఓటు వేయడం వల్ల ఇలా శారీరక ఆరోగ్యమూ లభిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...ఓటు వేసే హక్కు లేని చిన్నారులకూ ఓటు విలువేంటో చెప్పడం చాలా మంచిది అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు. చిన్నప్పటి నుంచే వాళ్లకి మన సొసైటీ గురించి చెప్పడం, ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు..? ఎవరిని ఎంపిక చేసుకోవాలి..? లాంటి విషయాలు వాళ్లకి అర్థమయ్యే విధంగా చెప్పాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వాళ్లలో ఆలోచించే సామర్థ్యం పెరుగుతుందని, పైగా తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ కూడా పెరిగినట్టవుతుందని వివరిస్తున్నారు. మొత్తంగా చూస్తే...ఓటు వేయడం ప్రజాస్వామ్యానికే కాదు ప్రజారోగ్యానికీ మంచిదే అని అర్థమవుతోంది. మరి ఇంకెందుకు ఆలోచన. కచ్చితంగా ఓటు వేసేద్దాం. 

Also Read: Arvind Kejriwal: అందుకే నేను రాజీనామా చేయలేదు, అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs KKR Match Highlights IPL 2025 | కేకేఆర్ ను మట్టి కరిపించిన ముంబై ఇండియన్స్ | ABP DesamDhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
Gas Cylinder Price Cut: రూ.45 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ రేటు - మీ నగరంలో కొత్త ధరలు ఇవీ
రూ.45 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ రేటు - మీ నగరంలో కొత్త ధరలు ఇవీ
Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
Brand Vizag: విశాఖలో తాజ్ వరుణ్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉపాధి అవకాశాలు
విశాఖలో తాజ్ వరుణ్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉపాధి అవకాశాలు
IPL 2025 Records: ఐపీఎల్ అరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, తొలి బంతికే వికెట్- ఎవరీ అశ్వనీ కుమార్
ఐపీఎల్ అరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, తొలి బంతికే వికెట్- ఎవరీ అశ్వనీ కుమార్
Embed widget