అన్వేషించండి

Arvind Kejriwal: అందుకే నేను రాజీనామా చేయలేదు, అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

Arvind Kejriwal: బీజేపీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా తాను ఎందుకు రాజీనామా చేయలేదో అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

Arvind Kejriwal on His Resignation: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలై ప్రచారం మొదలు పెట్టారు. మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన తన రాజీనామా అంశాన్నీ ప్రస్తావించారు. చాలా రోజులుగా కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో ఈ మేరకు కొన్ని పిటిషన్‌లు కూడా దాఖలయ్యాయి. కానీ సుప్రీంకోర్టు వాటిని కొట్టేసింది. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని తేల్చి చెప్పింది. ఇన్ని రోజుల తరవాత బయటకు వచ్చిన కేజ్రీవాల్..ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం గురించి మాట్లాడారు. తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని,ఆ ఆరోపణలకు తలొంచి రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించారు. 

"ఈ ముఖ్యమంత్రి పదవి నాకు ఏ మాత్రం ముఖ్యం కాదు. నాపైన తప్పుడు ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులో నన్ను ఇరికించారు. రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఇదంతా కుట్ర అని తెలుసు కాబట్టే నేను సీఎం పదవికి రాజీనామా చేయలేదు"

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి

అటు బీజేపీ మాత్రం కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తోంది. అంత పెద్ద కుంభకోణంలో అరెస్ట్ అయి 50 రోజుల పాటు కస్టడీలో ఉన్నా ఆ పదవిలో ఎలా ఉంటారంటూ ప్రశ్నిస్తోంది. తనను బలవంతంగా గద్దె దింపేందుకే బీజేపీ ఇలా కుట్ర చేసిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిపై ఎలా పోరాటం చేయాలో తనను చూసి నేర్చుకోవాలని తేల్చి చెబుతున్నారు. కీలక నేతలందరినీ కావాలనే జైలుకి పంపించి తమ పార్టీని అణిచివేయాలని బీజేపీ చూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే ఆప్ పని అయిపోతుందని అనుకుంటున్నారని, అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.  సౌత్ ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని చాలా మిస్ అయ్యానని అన్నారు. జైల్ నుంచి విడుదల కాగానే నేరుగా ప్రజల వద్దకే వచ్చానని, తను బాగుండాలని ప్రార్థించిన వాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలు తమ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే అమిత్‌షా ప్రధాని అవుతారని చేసిన వ్యాఖ్యలూ సంచలనమయ్యాయి. దీనిపై అమిత్‌ షా తీవ్రంగా స్పందించారు. వచ్చే ఐదేళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారని తేల్చి చెప్పారు. 

 

Also Read: Electoral Ink: చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్

టాప్ హెడ్ లైన్స్

MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
Yelahanka Palace Dispute: యలహంక ప్యాలెస్ వివాదం.. కోర్టు ఆఫిడవిట్‌లో ఏముంది? బెంగళూరులో అసలేం జరిగింది?
యలహంక ప్యాలెస్ వివాదం.. కోర్టు ఆఫిడవిట్‌లో ఏముంది? బెంగళూరులో అసలేం జరిగింది?
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Embed widget