Breaking News: 31 మంది చనిపోయారు అని మాకు సమాచారం ఉంది - హరీష్ రావు
Breaking News: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టాయి. వరదల ముంచెత్తాయి. ఖమ్మం, విజయవాడ ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇలాంటి మరెన్నో అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
LIVE
Background
భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలమైపోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ పూర్తిగా నీటిలోనే ఉన్న నగరాలుగా మారిపోయాయి. ఎటు చూసిన వరద నీరు కనిపిస్తోంది. ఈ రెండు ప్రాంతాలను పడవల్లో మాత్రమే వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.
విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎక్కడా రోడ్లు అనేవి కనిపించడం లేదు. పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా మోకాళ్లు లోతులో నీరు నిలిచి ఉన్నాయి. వర్షాలకు తోడు కృష్ణా నది పోటెత్తడంతో వైరా, మున్నేరు, తమ్మిలేరు, కట్టలేరు బెజవాడను ముంచేశాయి. కృష్ణానదికి వస్తున్న భారీ వరద నీరును ఇటు సముద్రానికి పంపిస్తున్నారు. మరోవైపు జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బెజవాడ కాస్త జలవాడగా మారిపోయింది. ఇంకా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరనుందే సమాచారం అధికారులకు ఉంది. దీంతో ప్రజలు మరింతగా వణికిపోతున్నారు.
ఇలా ఓవైపు వర్షం దంచి కొట్టడం, పై రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీరుతో బెజవాడను నీరు చుట్టుముట్టింది. రెండు రోజులగా జలదిగ్బంధంలో ఉంచింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కార్లు పూర్తిగా నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాడ్ పూర్తిగా నీట మునిగింది. రైల్వేట్రాక్‌పైకి నీళ్లు చేరడంతో ట్రైన్స్ ఆలస్యంగా నడుపుతున్నారు.
బుడమేరులోకి వరద నీరు భారీగా వస్తుండటంతో ఉధృతి బాగా పెరిగింది. 20 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితే ఉండేదని ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోందనిఅంటున్నారు. దీని వల్ల ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీకి చెందిన 70 గేట్లు ఎత్తి వరద నీరును బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం 11,20,101 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో కలిపి 11 లక్షల క్యూసెక్కులకు దాటేసింది. ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు.
దీనికి తోడు బెజవాడలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి దుర్ఘటనల్లో మూడు రోజులుగా ఆరుగురు మృతి చెందారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు కూడా కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు నాశనమవుతున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నందున ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌ను తాత్కాలికంగా మూసివేశారు. రాకపోకలు నియంత్రించారు.
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి- 20 సెంటీమీటర్లు
తిరువూరు- 25 సెంటీమీటర్లు
గుంటూరు- 22 సెంటీమీటర్లు
కుకునూరు- 20 సెంటీమీటర్లు
అచ్చంపేట- 19 సెంటీమీటర్లు
తెనాలి, మంగళగిరి- 17 సెంటీమీటర్లు
పిడుగురాళ్ల, నందిగామ- 17 సెంటీమీటర్లు
మాచర్ల, పాలేరు బ్రిడ్జి- 16 సెంటీమీటర్లు
వేలేర్పాడు- 15 సెంటీమీటర్లు
నూజివీడు 14 సెంటీమీటర్లు
తెలంగాణలో వరద పరిస్థితి
భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మున్నేరు ఉద్ధృతి కారణంగా ఖమ్మం ఇప్పుడు నీట మునిగింది. జల దిగ్బంధంలో చిక్కున్న ప్రాంతాలు బొక్కలగడ్డ, దానవాయిగూడెం, రామన్నపేట, వెంకటేశ్వర్‌నగర్,మారుతీనగర్, ప్రకాష్‌నగర్, కవిరాజునగర్, ఇక్కడ రాత్రి వేళలోల సహాయక చర్యలు చేపట్టారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 3,22,821 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 147.5 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు. అంటే మరో 0.5 మాత్రమే గ్యాప్ ఉందున్నమాట. నీటి నిల్వ పరిస్థితి చూస్తే... ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 18.7862 టీఎంసీలు, పూర్తిస్థాయి నిల్వసామర్థ్యం మాత్రం20.175 టీఎంసీలు. కడెం ప్రాజెక్టు కూడా కదం తొక్కుతోంది. మొత్తం 18 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు ఉంటే... అవుట్ ఫ్లో 2,65,218 క్యూసెక్కులుగా ఉంది. ఇన్‌ఫ్లో కానీ 3.50 లక్షలు దాటితే మాత్రం ప్రమాదం తప్పదనే మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు ఉంటే... ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులుగా ఉంది.
పాలేరు వాగు ప్రవాహం ధాటికి సూర్యపేటలోని కోదాడ వద్ద ఉన్న ఓ బ్రిడ్జి తెగిపోయింది. రామాపురం వద్ద ఉన్న క్రాస్ రోడ్డ బ్రిడ్జి ఏపీకి వెళ్లేందుకు ప్రధానమైనది. దీంతో అటు నుంచి ఇటు వచ్చే ఇటు నుంచి వెళ్లే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
తెలంగాణలో రిజిస్టర్ అయిన వర్షపాతం వివరాలు
కామారెడ్డి - 25 సెంటీమీటర్లు
నిజామాబాద్ -22.1 సెంటీమీటర్లు
గాంధారి- 18.5 సెంటీమీటర్లు
తాడ్వాయి-18 సెంటీమీటర్లు
రామారెడ్డి -18 సెంటీమీటర్లు
లింగంపేట-18 సెంటీమీటర్లు
సర్వాపూర్ -18 సెంటీమీటర్లు
పాపన్నపేట -17 సెంటీమీటర్లు
మిరదొడ్డి-16 సెంటీమీటర్లు
సిరికొండ -16 సెంటీమీటర్లు
31 మంది చనిపోయారు అని మాకు సమాచారం ఉంది - హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి వరద సహాయం చెయ్యకుండా మాపై బురుద వేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మాపై విమర్శలు చెయ్యడమే రేవంత్ రెడ్డికి పనిగా ఉంది.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారు.. వాతావరణ శాఖ చెప్పిన కూడా ముందస్తు చర్యలు చెయ్యలేదు.
ప్రభుత్వ వైఫల్యం ఇది, 16 మంది చనిపోయారు అని ప్రభుత్యం చెప్తుంది.. మా కార్యకర్తలు సహాయక చర్యలు చేస్తున్నారు, 31 మంది చనిపోయారు అని మాకు సమాచారం ఉంది.
ఖమ్మంలో తొమ్మిది సీట్లు ఇస్తే, తొమ్మిది మందిని కూడా కపడలేకపోయారు.. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని , తప్పులు సరిదిద్దుకోని, ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు అడిగిన మీరు.. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు ఇవ్వండి.
ఖమ్మంలో సహాయం అడిగిన వరద బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.. ప్రజాపాలన అంటే. లాఠీ ఛార్జ్ చెయ్యడమా - హరీష్ రావు
KTR News: అప్పట్లో మేం ఆపని చేయడం వల్లే వరద ముప్పు తప్పింది - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదుర్కోవచ్చని మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటిఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన ఎస్.ఎన్.డి.పి. కార్యక్రమం అక్షరాలా ఇది నిరూపించిందన్నారు. గత రెండు, మూడు రోజులుగా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా లోతట్టు ప్రాంతాలకు ముంపు లేకుండా కాపాడటంలో SNDP కీలక పాత్ర పోషించిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణకు ఎకనమిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ లో భారీవర్షాల వల్ల వచ్చే వరద ముప్పును నివారించేందుకు గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్.ఎన్.డి.పి) చేపట్టామని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి
చంద్రగిరి నియోజకవర్గం, అనుపల్లి లో పవన్ కళ్యాణ్ బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ కి గురైన ఇద్దరు యువకులు
గోపి అనే యువకుడు మృతి, మధు అనే యువకుడికి తీవ్ర గాయాలు
తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు
వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే సీఎం ఏం చేస్తున్నాడు ? మాజీ మంత్రి సింగిరెడ్డి
వరద సహాయక చర్యలపై విఫలమైన ప్రభుత్వాన్ని తప్పుపట్టిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం నిద్దుర పోతుందా ?
వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే సీఎం ఏం చేస్తున్నాడు ?
వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి భడే భాయ్ ని హెలికాప్టర్ పంపించమని అడిగే తీరిక సీఎంకు లేదా ?
నిన్నంతా సీఎం ఎక్కడ పడుకున్నాడు ?
ప్రజలంతా వరదల్లో చిక్కుకున్న తర్వాత ఈ రోజు తీరిగ్గా బయటకు వచ్చాడు
ఖమ్మంలో చిక్కుకున్న 9 మంది కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సహాయం లభించక సొంతంగా గజ ఈతగాళ్లను తెప్పించుకుని బయటపడడం సిగ్గు చేటు
కాంగ్రెస్ పార్టీని నమ్మిన ఖమ్మం ప్రజలను నట్టేట ముంచారు
వరద సహాయక చర్యలపై విఫలమైన ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో తప్పుపట్టిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Vijayawada News: విజయవాడలో ఏ సమస్య ఉన్నా ఈ అధికారులకు చెప్పండి- ఆఫీసర్స్ ఫోన్ నెంబర్లు ఇవే !
Vijayawada News: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వరదప్రభావిత ప్రాంతాల వారీగా అధికారులను ఏర్పాటు చేసేంది. వారి ఫోన్ నెంబర్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచింది.
విజయవాడ రూరల్
గొల్లపూడి- ఈ.గోపీచంద్ 9989932852
రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859
జక్కంపూడి- నాగమల్లిక 9966661246
పైడూరుపాడు- శ్రీనివాస్‌యాదవ్ 7416499399
కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595
అంబాపురం- బి.నాగరాజు 8333991210
విజయవాడ సెంట్రల్
దేవినగర్- కె.ప్రియాంక 8500500270
ఉడా కాలనీ- శ్రీనివాస్‌రెడ్డి 9100109124
ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822
ఆర్‌ఆర్ పేట- వి.పెద్దిబాబు 9848350481
మధ్యకట్ట- టి.కోటేశ్వరరావు 9492274078
ఎల్‌బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180
ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941
లూనా సెంటర్- పి.శ్రీనివాసరావు 9866776739
అజిత్‌సింగ్ నగర్- కె.అనురాధ 9154409539
సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088
రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153
పటేల్ నగర్- కె.శ్రీనివాసరావు 7981344125
నందమూరి నగర్- యు.శ్రీనివాసరావు 9849909069
విజయవాడ ఈస్ట్
రాజరాజేశ్వరీ నగర్- పి.వెంకటనారాయణ 7901610163
బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148
ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677
రామలింగేశ్వరనగర్- జి.ఉమాదేవి 8074783959
మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772
కృష్ణలంక- పీఎం సుభానీ 7995087045
విజయవాడ వెస్ట్
జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026
పాల ఫ్యాక్టరీ ఏరియా- జె.సునీత 9441871260
ఓల్డ్ ఆర్‌ఆర్ పేట- ఎస్‌ఏ ఆజీజ్ 9394494645
ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067