By: Ram Manohar | Updated at : 16 Jul 2022 03:03 PM (IST)
బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే.
విడిపోతున్నట్టు లీగల్ డాక్యుమెంట్ కావాలి..
రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి బిహార్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా సరే, సంబంధింత విభాగాల అధికారులతో మాట్లాడి, వారి అనుమతి తీసుకుని ఆ తరవాత పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ వెంటనే తమ మారిటల్ స్టేటస్ వివరాలు తెలియ జేయాలని స్పష్టం చేసింది. రెండో వివాహం చేసుకోవాలనుకుంటే మొదటి భర్త లేదా భార్య నుంచి విడిపోతున్నట్టుగా లీగల్ డాక్యుమెంట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. తరవాత సంబంధిత విభాగానికి తెలియజేయాలి.
అనుమతి తీసుకోకపోతే అవన్నీ బంద్..
ఒకవేళ మొదటి భర్త లేదా భార్యకు సమాచారం ఇవ్వకపోయినా, వాళ్లు అభ్యంతరం తెలిపినా, రెండో వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం తరపున వచ్చే ఏ బెనిఫిట్స్ కూడా రావని స్పష్టం చేసింది. ఈ నిబంధన పురుషులతో పాటు మహిళలకీ వర్తిస్తుంది. అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకున్న వాళ్లు సర్వీసులో ఉండగా హఠాన్మరణం చెందితే,వాళ్ల భర్త లేదా భార్యకు గానీ, వాళ్ల సంతానానికి గానీ కారుణ్య నియామకం వర్తించదు. అంటే...కారుణ్య నియామకం కింద వారికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించదు. ఇలాంటి సమయంలో మొదటి భార్య లేదా భర్త సంతానానికే ప్రాధాన్యతనిస్తారు. వెంటనే ఈ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డివిజనల్ కమిషనర్స్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌లు, డీజీపీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
What ?!
— Rusy Kohli (@RusyKohli) July 14, 2022
"The state government has issued a fresh notification wherein it has directed every government official to inform about their marital status and be eligible for a second marriage only after obtaining the necessary permission" ,.,..,.#Biharhttps://t.co/8J08pbDuJi
If you are planning to have a second marriage by staying in Bihar, the state government has issued new guidelines for you. This guideline is especially for those who are employed in the Government of Bihar.
— AshIsh (@Zashish1994) July 16, 2022
Also Read: Bundelkhand Expressway UP: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుని ప్రారంభించిన ప్రధాని మోదీ, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే రెడీ
Also Read: Viral Video : ప్రేమంటే సులువు కాదురా ! - ఢిల్లీ మెట్రోలో ఆ జంటను చూస్తే అర్థమైపోతుంది
Kurnool News : కర్నూలు జిల్లాలో గడప గడపకూ నిరసన సెగ
Nizamabad News: వర్షం పడింది- మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది
Breaking News Live Telugu Updates: మంత్రి బొత్సతో అసంపూర్తిగా ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు
Rajinikanth as Governor: రజనీకాంత్కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?
Railway New Coaches : భారతీయ రైల్వేకు కొత్త బోగీలు, సౌకర్యాలతో పాటు స్పీడ్ పెరిగిందోచ్!
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?
ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!
Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?