News
News
X

Viral Video : ప్రేమంటే సులువు కాదురా ! - ఢిల్లీ మెట్రోలో ఆ జంటను చూస్తే అర్థమైపోతుంది

ప్రేమించాలంటే చాలా తెలుసుకోవాలి. ముందుగా అమ్మాయి మనసును నొప్పించకూడదు. ఆమె కాదంటే ఔనని అసలు అనకూడదు. ఎవరైనా అంటే ఏమవుతుందో తెలుసా ?

FOLLOW US: 

Viral Video :  "ప్రేమంటే సులువు కాదురా - అది నీవు గెలువలేవరా " అని... ఖుషీ సినిమాలో ఓ పాటలో చెప్పించారు కానీ అది అవాస్తవమేమీ కాదు. ప్రేమలో పడిన ప్రతి ఒక్కరికీ అనుభవమే అయి ఉంటుంది. చాలా మంది మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కొంత మందివి మాత్రం ఈ సోషల్ మీడియా యుగంలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి జంటే ఒకటి ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో కెమెరాకు చిక్కింది. 

ఢిల్లీ మెట్రో రైల్లోకి ఓ జంట ఎక్కింది. చూడముచ్చటగా ఉన్నారు. అయితే మాస్కులు పెట్టుకుని ఉన్నారు. ఆధునిక వేషధారణతో ఉన్నారు. అంటే మంచి బ్రాండ్ దుస్తులు... యాక్సెసరీస్ అన్నమాట. అయితే వీరి మధ్య చిన్నగా గొడవ ప్రారంభమయింది. దీంతో మెట్రో ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీశారు. ఆ గొడవ ఎక్కడి దాకా వెళ్లిందంటే చివరికి ఆ అమ్మాయి .. లవర్‌ని చెడామడా తిట్టేసి.. టప టపామని కొట్టేసి తర్వాత వచ్చిన స్టేషన్‌లో దిగిపోయి తన దారిన తాను వెళ్లిపోయింది. తర్వాత అతనూ అదే పని చేశాడు. 

ఇంతకూ వాళ్ల మధ్య గొడవ ఎందుకొచ్చిందంటే.. డ్రెసింగ్ మీద. ఆ పాప వేసుకున్న టాప్ ఖర్చు వంద ఉంటుందని ... వర్జిన్ జారా బ్రాండ్ టాప్ కాదని.. రోడ్ సైడ్‌న అమ్మేదని అతను అన్నాడు. ఆ మాటలకు ఆ అమ్మాయికి కోపం వచ్చింది. లవర్‌తో గొడవ పెట్టుకుంది. అయితే  ప్రేమలో ఉన్న ఆ లవర్ తగ్గాల్సిన చోట తగ్గలేదు. పైగా ఒకటికి రెండు మాటలన్నాడు. దీంతో ఆ అమ్మాయి చేతలకు.. చేతులతో పని చెప్పి వెళ్లిపోయింది. 

వీరి గొడవను సీరియస్‌గా చూసిన మెట్రో ప్రయాణికులందరూ.. వాళ్లు వెళ్లిపోయిన తర్వతా ఒక్క సారి భళ్లుమని నవ్వారు. ప్రేమంటే అంత సులువు కాదని సెటైర్లు వేసుకున్నారు. 

Published at : 16 Jul 2022 01:31 PM (IST) Tags: Viral video Delhi Metro Video Lovers Fight in Metro Delhi Metro Lovers

సంబంధిత కథనాలు

India's Policy and Decisions: భారత్‌ను ప్రత్యేకంగా నిలిపిన పాలసీలు ఇవే, వాటి వివరాలు ఇదిగో

India's Policy and Decisions: భారత్‌ను ప్రత్యేకంగా నిలిపిన పాలసీలు ఇవే, వాటి వివరాలు ఇదిగో

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!

Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!

Digital Rupee: డిజిటల్‌ రూపాయిపై ఆర్బీఐకి ఎందుకింత ఆసక్తి! వీటితో నష్టాలేమైనా ఉన్నాయా!

Digital Rupee: డిజిటల్‌ రూపాయిపై ఆర్బీఐకి ఎందుకింత ఆసక్తి! వీటితో నష్టాలేమైనా ఉన్నాయా!

India’s Space Odyssey: ఆదిత్య L1 నుంచి చంద్రయాన్ 3, గగన్‌యాన్ వరకు- ఇస్రో భవిష్యత్తు మిషన్లు ఇవే!

India’s Space Odyssey: ఆదిత్య L1 నుంచి చంద్రయాన్ 3, గగన్‌యాన్ వరకు- ఇస్రో భవిష్యత్తు మిషన్లు ఇవే!

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!