అన్వేషించండి

Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!

132 Feet Telecom Tower Missing:బిహార్‌లో ఏకంగా 132 అడుగుల భారీ మొబైల్ టవర్‌ను, భారీ జనరేటర్‌ను దొంగలు మాయం చేశారు. ఇదేముంది గతంలో ఏకంగా బ్రిడ్జిల్నే ఎత్తుకుపోయారని కొంత మంది లైట్ తీసుకుంటున్నారు.

Bihar Bizarre Theft Cases:  అవును, ఇది అక్షరాలా నిజం!   బిహార్‌ పుణ్యభూమిలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సాధారణంగా దొంగలు ఇళ్లల్లోకి దూరి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లడం లాంటి బోరింగ్ క్రైమ్స్ చూసుంటారు. కానీ, బిహార్ దొంగల రూటే సెపరేటు. వాళ్లు చిన్న చిన్న వస్తువుల జోలికి అస్సలు వెళ్లరు. ఒకసారి ఏకంగా రైల్వే ఇనుప వంతెనను కరిగించి అమ్మేస్తారు, మరోసారి రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను పీకేసి గుట్టుచప్పుడు కాకుండా పట్టుకెళ్తారు. ఇప్పుడు అదే సిరీస్‌లో లేటెస్ట్ ఐటమ్‌గా, బక్సర్ జిల్లాలోని దుమ్‌రావ్ పట్టణంలో ఏకంగా 132 అడుగుల భారీ మొబైల్ టవర్‌ను  , దానికి తోడు ఒక 15 KVA బరువైన డీజిల్ జనరేటర్‌ను కూడా మాయం చేసి వార్తల్లో నిలిచారు! 

 జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  అనే ఓ ప్రైవేట్ టెలికాం సంస్థ 2010లో దుమ్‌రావ్ పట్టణంలోని హరేనాథ్ యాదవ్ అనే వ్యక్తి స్థలంలో ఈ 132 అడుగుల భారీ టవర్‌ను నాటింది. 12 ఏళ్ల అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కంపెనీ సదరు యజమానికి అద్దె కట్టడం మానేసింది. బాబూ.. నా అద్దె నాకివ్వండి  అంటూ ఆ భూయజమాని కంపెనీకి నాలుగు సార్లు లీగల్ నోటీసులు పంపినా, ఆ టెలికాం కంపెనీ మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోయింది. కట్ చేస్తే.. ఇటీవలే సడన్‌గా నిద్ర లేచిన సదరు కంపెనీ ప్రతినిధులు, ఎక్కడో మూలన పడి ఉన్న ఆ పాత టవర్‌ను రిపేర్ చేద్దామని మెకానిక్‌లను తీసుకుని లొకేషన్‌కు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే.. అక్కడ టవర్ లేదు, జనరేటర్ లేదు.. కేవలం పచ్చటి గడ్డి, సిమెంట్ దిమ్మెలు మాత్రమే మిగిలాయి. దీంతో వారు హతాశులై గుండెలు బాదుకుంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశారు.
  
సాధారణంగా ఒక చిన్న ఫోన్ పోతేనే లొకేషన్ ట్రాక్ చేసే పోలీసులు, ఇప్పుడు ఏకంగా నెట్‌వర్క్ ఇచ్చే 132 అడుగుల మొబైల్ టవరే మాయమవడంతో తలలు పట్టుకుంటున్నారు. దుమ్‌రావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో, అదీ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఇంత పెద్ద టవర్‌ను గ్యాస్ కట్టర్లతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి, లారీల్లో లోడ్ చేసుకుని వెళ్తుంటే.. చుట్టుపక్కల జనం ఏమనుకున్నారంటే, సదరు టెలికాం కంపెనీ వాళ్లే వచ్చి తమ టవర్‌ను డిస్మాంటిల్ చేసుకుంటున్నారని భావించి సైలెంట్‌గా ఉండిపోయారట! దొంగల క్రియేటివిటీని చూసి స్థానికులు సైతం అవాక్కవుతున్నారు.  

  స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. దీనిపై ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టవర్ మాయమైన మాట నిజమే, దీనిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నాం, త్వరలోనే క్లారిటీ ఇస్తాం అని బక్సర్ ఎస్పీ శుభమ్ ఆర్య చాలా సీరియస్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు.  ఇదంతా చూస్తుంటే దొంగల పనే అని కంపెనీ గగ్గోలు పెడుతుంటే, స్థానిక పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అద్దె కట్టకుండా ఎగ్గొట్టిన కంపెనీ తీరుతో విసిగిపోయిన భూయజమాని, ఆ టవర్‌ను, జనరేటర్‌ను స్క్రాప్  కింద అమ్మేసి తన అద్దె వసూలు చేసుకున్నాడని  అనుమానిస్తున్నారు. ఆ దిశగాదర్యాప్తుచేస్తున్నారు.  ఇలాంటి వింతలు కేవలం బిహార్‌లోనే సాధ్యమని, భవిష్యత్తులో దొంగలు ఏకంగా సెక్రటేరియట్ బిల్డింగ్‌నో లేదా గంగా నదినో ఎత్తుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.    

టాప్ హెడ్ లైన్స్

Mahela Jayawardene Steps Down: 3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
ABP Desam Top 10, 17 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 17 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget