Samrat Chaudhary Bihar CM viral sketch: సీఎంను అబ్బురపరుద్దామని ఓ బిల్డర్ స్కెచ్ వేసి ..ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చాడు - ఇంటర్నెట్ అంతా షేక్ అయిపోతోంది!
Samrat Chaudhary : నాగార్జున కింగ్ సినిమా గుర్తుంది కదా..అందులో బ్రహ్మీ స్కెచ్ వేస్తాడు శ్రీహరి. అచ్చంగా అలాంటిదే బీహార్ సీఎం స్కెచ్ వేసి.. ఫ్రేమ్ కట్టించి ఆయనకే గిఫ్ట్ గా ఇచ్చాడో బిల్డర్.

Bihar politics viral memes 2026: బీహార్ సీఎం సమ్రాట్ చౌదరిని రోజూ చాలా మంది కలుస్తూంటారు. తాజాగా ఆయనను బిల్డర్ సంజీవ్ శ్రీవాస్తవ కలిశారు. సీఎంను కలుస్తున్నందున ఓ మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. బాగా ఆలోచించి.. సీఎం మర్చిపోలేని విధంగా స్కెచ్ వేయాలనుకున్నారు. వేశారు కూడా. దాన్ని ఫ్రేమ్ కట్టించి తీసుకెళ్లి నేరుగా సీఎంకు ఇచ్చారు. ఇప్పుడు నిజంగానే సీఎంగా అది మెమరబుల్..మర్చిపోలేని స్కెచ్ అయింది. కాకపోతే కామెడీగా
A Builder gifts a sketch to Bihar CM Samrat Choudhary and the CM himself looks confused about whose sketch it actually is
— Raajeev Chopra (@Raajeev_Chopra) May 27, 2026
When Picaso of Patna came to meet CM Samrat Chaudhary last week.#samratsarkar pic.twitter.com/xdunbsZMY8
సంజీవ్ శ్రీవాస్తవ ఒక పెద్ద బిల్డర్ అయినప్పటికీ, తన అభిమానాన్ని ఒక పెన్సిల్ స్కెచ్ రూపంలో చూపించాలనుకున్నారు. కానీ, ఆ బొమ్మ చూసిన నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. బహుశా బిల్డర్ గారు ఇల్లు కట్టినంత పక్కాగా బొమ్మ గీయలేకపోయారేమో అని కొందరు, సెటైర్లు వేస్తున్నారు. ఆ బొమ్మలో ఉన్న కళ్లు, గడ్డం చూస్తుంటే అవి సామ్రాట్ చౌదరివి కావని, ఎవరో కార్టూన్ క్యారెక్టర్‌వి అని ట్రోలర్లు ఆటాడుకుంటున్నారు.
जब खुद के अंदर ऐसी अद्भुत प्रतिभा हो तो उसे छिपा कर रखना चाहिए , ऐसे खुलेआम उसका प्रदर्शन नहीं करना चाहिए ,
— Prem Bhardwaj (@premkumarcbn01) May 28, 2026
बिहार के CM सम्राट चौधरी से मिलने के कंस्ट्रक्शन कंपनी के डायरेक्टर आए थे , और साथ में उनकी पोर्ट्रेट लेकर आए थे !
मुलाकात की फोटो सोशल मीडिया पर डालने के बाद जमकर वायरल… pic.twitter.com/gFtnkzABrA
ఈ ఫోటోలో మరో ప్రధాన ఆకర్షణ బిల్డర్ సంజీవ్ శ్రీవాస్తవ వేసుకున్న కిలోల కొద్దీ బంగారం. మెడలో దండలు, చేతులకు భారీ కడియాలు.. చూస్తుంటే ఆయన ఒక గోల్డ్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. అంత బంగారం వేసుకున్న వ్యక్తి కనీసం ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌తో బొమ్మ గీయించలేకపోయారా అన్నది నెటిజన్ల ప్రధాన ప్రశ్న. ఒకవైపు అంతటి విలాసవంతమైన ఆహార్యం, మరోవైపు భయపెట్టేలా ఉన్న స్కెచ్.. ఈ విరుద్ధమైన కలయికే ఈ ఫోటోను గ్లోబల్ లెవల్‌లో మీమ్ మెటీరియల్‌గా మార్చేసింది.
लगता है सम्राट चौधरी को खुद अपनी बेइज्जती का एहसास हो गया।😄
— Jaiky Yadav (@JaikyYadav16) May 27, 2026
संजीव श्रीवास्तव जो बिहार के कोई बिजनेसमैन हैं मुख्यमंत्री सम्राट चौधरी से मिलने आए थे,
उन्होंने जो सम्राट चौधरी को स्केच भेंट किया है उसे देखकर हर कोई हंस रहा है,
खुद सम्राट चौधरी भी इसे देखकर अपनी हंसी नहीं रोक… pic.twitter.com/czGLTEgvUA
సామ్రాట్ చౌదరి రియాక్షన్
ఆ బొమ్మను అందుకుంటున్నప్పుడు సామ్రాట్ చౌదరి ముఖంలో ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు హైలైట్‌గా నిలుస్తోంది. అభిమాని ఇచ్చాడు కాబట్టి నవ్వుతూ తీసుకోవాలి.. కానీ ఆ బొమ్మను చూస్తే ఏడుపొస్తోంది అన్నట్లుగా ఆయన ఇచ్చిన లుక్ ఇప్పుడు వేల కొద్దీ మీమ్స్‌కు కారణమైంది. రాజకీయ నాయకులకు అభిమానులు రకరకాల కానుకలు ఇస్తుంటారు. కానీ, సంజీవ్ శ్రీవాస్తవ ఇచ్చిన ఈ స్కెచ్ మాత్రం సామ్రాట్ చౌదరి రాజకీయ జీవితంలోనే కాకుండా, ఇంటర్నెట్ చరిత్రలోనూ ఒక చిరస్థాయి ‘కామెడీ’గా మిగిలిపోవడం ఖాయం.
ట్రెండింగ్ వార్తలు






















