నన్నే కాటేస్తావా? పామును నమిలేసిన మందుబాబు, కానీ..
తనని కాటేసిన పాముకు ఓ మందుబాబు చుక్కలు చూపించాడు. పిల్ల పామే కదా.. తనకేమీ కాదని నిద్రపోయాడు. చివరికి శాస్వత నిద్రలోకి జారుకున్నాడు.
పాము కాటేస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతాం. కానీ, అతడు అలా చేయలేదు. నన్నే కాటేస్తావా.. అంటూ అతడు ఆ పామును పట్టుకుని నోట్లో పెట్టుకుని నమిలేశాడు. ఆ పాముపై రివేంజ్ తీర్చుకొనే ప్రయత్నంలో అతడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది.
చాందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదోదేహ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రమా మహతో మద్యం తాగి ఇంటి ముందు కూర్చున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పాము పిల్ల రమాను కాటేసింది. దీంతో ఆగ్రహానికి గురైన రమా దాన్ని తోక పట్టుకుని నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని కొరుకుతూ నమిలేయడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆ పాము ముఖం మీద అనేకసార్లు కాటేసింది. దీంతో రమా పామును తీసుకెళ్లి ఓ చెట్టు కింద వదిలేశాడు.
కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లమని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదు. అది పిల్ల పామమని, అది కాటేస్తే ఏం కాదని చెప్పి.. నేరుగా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అయితే, సోమవారం ఉదయానికి రమా చనిపోయి కనిపించాడు. ఇటీవల ఔరంగబాద్ పోలీసులు మేకను హత్య చేశాడనే కారణంతో ఓ మహేంద్రదాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో అతడు మేక మెడను మెలేశాడు. దీంతో అది చనిపోయింది. ఆ మేక యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ఓ వ్యక్తి బతికున్న పామును నమిలి తినేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నూడిల్స్ తిన్నట్లుగా తింటుండడంతో నెటిజన్లు ఆ వీడియో చూసి అవ్వక్కయ్యారు.ఆ వీడియోలో వ్యక్తి బతికున్న పామును ఏదో స్నాక్స్ తింటున్నట్లుగా సునాయసంగా తినేస్తున్నాడు. ఆ పాము కదులుతూ గిలగిలా కొట్టుకుంటున్న ఏ మాత్రం జంకు లేకుండా అతను తినేస్తుండడం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఆ వ్యక్తి పాము తింటుంటే స్నేహితులు అరుస్తూ ఉత్సాహపర్చారు. పైగా ఈ వీడియోకు ‘‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వెర్షన్’’ అనే కాప్షన్‌తో పోస్ట్ చేశారు. అసలు ఈ వీడియో ఎక్కడిదనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైవ్ ప్రొటెక్షన్ సొసైటీ - ఎఫ్ఏడబ్ల్యూపీఎస్ ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. ఆ వీడియో హైదరాబాద్ ప్రాంతానికి చెందినదే అని తెలుస్తోంది. ఆ ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీ ప్రాంతంలో జరిగి ఉండవచ్చని ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైవ్ ప్రొటెక్షన్ సొసైటీ అనుమానం వ్యక్తం చేసింది. ఆ వీడియోను చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి.
Also Read: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా..
Also Read: అది దెయ్యమేనా? కెమేరాకు చిక్కిన వింత ఆకారం.. నాగపూర్ ప్రజల్లో గుబులు!
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!