Hyderabad Viral Video: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా.. వైరల్ వీడియో
బతికున్న పామును ఓ వ్యక్తి నూడిల్స్ తింటున్నట్లుగా సునాయసంగా తినేస్తున్నాడు. ఆ పాము కదులుతూ ఉన్నా ఏ మాత్రం జంకు లేకుండా అతను తినేస్తుండడం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ వీడియోలకు కొదవే లేదు. ఏ మాత్రం కాస్త కొత్తగా లేదా భిన్నంగా వీడియో ఉన్నా అది కరోనా కంటే వేగంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోతుంటుంది. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన అత్యంత జుగుప్సాకరంగా ఉండడంతో దాన్ని చూసిన వారంతా ముఖం చిట్లించుకుంటున్నారు. ఇంకొందరైతే బాధగా, భయంగా ఆ వీడియో మొత్తం చూసేస్తూ అతని సాహసానికి ఆశ్చర్యపోతున్నారు. ఫేమస్ అయ్యేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా? ఒక బతికున్న పామును ఓ వ్యక్తి తినేస్తున్నాడు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నూడిల్స్ తిన్నట్లుగా తింటుండడంతో నెటిజన్లు ఆ వీడియో చూసి అవాక్కవుతున్నారు.
ఆ వీడియోలో వ్యక్తి బతికున్న పామును ఏదో స్నాక్స్ తింటున్నట్లుగా సునాయసంగా తినేస్తున్నాడు. ఆ పాము కదులుతూ గిలగిలా కొట్టుకుంటున్న ఏ మాత్రం జంకు లేకుండా అతను తినేస్తుండడం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఆ వ్యక్తి పాము తింటుంటే స్నేహితులు అరుస్తూ ఉత్సాహపర్చారు. పైగా ఈ వీడియోకు ‘‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వెర్షన్’’ అనే కాప్షన్‌ను యాడ్ చేశారు.
అసలు ఈ వీడియో ఎక్కడిదనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైవ్ ప్రొటెక్షన్ సొసైటీ - ఎఫ్ఏడబ్ల్యూపీఎస్ ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. ఆ వీడియో హైదరాబాద్ ప్రాంతానికి చెందినదే అని తెలుస్తోంది. ఆ ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీ ప్రాంతంలో జరిగి ఉండవచ్చని ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైవ్ ప్రొటెక్షన్ సొసైటీ అనుమానం వ్యక్తం చేసింది. ఒక బతికి ఉన్న జీవిని హింసించడం, తినడం నేరమని, ఆ వ్యక్తిని ఎక్కడున్నా పట్టుకుని చట్టప్రకారం శిక్షించాలని ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైవ్ ప్రొటెక్షన్ సొసైటీ సూచించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ పోలీస్, రాచకొండ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
A person chewing a Live Snake is going viral on social media. It's an act of madness. Video is supposedly from Hyderabad. Requesting @hydcitypolice @TelanganaDGP @RachakondaCop @cyberabadpolice to investigate and book the culprits involved under relevant acts. @HiHyderabad pic.twitter.com/mCxlGKsUCW
— Forests And Wildlife Protection Society-FAWPS (@FawpsIndia) August 4, 2021
‘‘ఓ వ్యక్తి బతికి ఉన్న పామును తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పిచ్చి తనానికి పరాకాష్ఠ. ఈ వీడియో హైదరాబాద్‌కు చెందినదే అని తెలుస్తోంది. కాబట్టి, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌లను కోరేది ఏంటంటే.. జీవ హింస చేస్తున్న ఇతణ్ని ఎక్కడున్నా పట్టుకొని తగిన చర్యలు తీసుకోండి.’’ అని ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైవ్ ప్రొటెక్షన్ సొసైటీ ట్వీట్ చేసింది.
స్పందించిన పోలీసులు
అయితే, హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ ట్వీట్‌పై స్పందించారు. తప్పకుండా తాము చర్యలు తీసుకుంటామని, అతనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఉంటే పంపాలని పోలీసులు కోరారు. మరోవైపు, నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందించారు. పలువురు వాంతులు చేసుకుంటున్నట్లుగా ఇమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.