Ghost in CCTV: అది దెయ్యమేనా? కెమేరాకు చిక్కిన వింత ఆకారం.. నాగపూర్ ప్రజల్లో గుబులు!
నాగపూర్‌లోని శతాబ్ది నగర్‌లో ఓ వింత ఆకారం రోడ్లపై తిరగడం చూసి స్థానికులు భయాందోళనలకు గురవ్వుతున్నారు. ఇంతకీ అది దెయ్యమేనా?
దెయ్యాలంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. అవి కంటికి కనిపించకపోయినా.. ఎక్కడో ఏదో భయం ఉంటుంది. అలాంటిది.. అక్కడ మేం దెయ్యం చూశామని ఎవరైనా చెబితే? గుండె జారిపోతుంది కదూ. ప్రస్తుతం నాగపూర్‌లోని శతాబ్దినగర్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. రాత్రి వేళ ఇంట్లో చిన్న శబ్దం వచ్చినా సరే వణికిపోతున్నారు. ఇందుకు కారణం.. ఓ వైరల్ వీడియో.
రాజేంద్ర మెష్రామ్ అనే వ్యక్తి ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమేరాకు ఓ వింత ఆకారం చిక్కింది. తెల్లని ఆకారంలో.. గాల్లో తేలుతూ పరుగులు పెడుతున్నట్లు కనిపించిన ఆ ఆకారం చూసి.. తప్పకుండా అది దెయ్యమేనని భావిస్తున్నారు. ఆ వింత ఆకారం రాజేంద్ర ఇంటికి సమీపంలో ఉన్న ఓ పాడుబడిన ఇంట్లోకి పరుగులు పెట్టినట్లుగా ఆ వీడియోలో ఉంది. దీంతో స్థానికులు కూడా అది తప్పకుండా దెయ్యమే కావచ్చని, తమకు ఆ ఇంటి నుంచి ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తుంటుందని, ఒక్కోసారి వింత వింత శబ్దాలు వస్తుంటాయని తెలుపుతున్నారు.
ఈ సమాచారం దావనంలా వ్యాపించడంతో శతాబ్దినగర్ ప్రజలకు కంటి మీద కునుకు లేదు. తమ ప్రాంతంలో దెయ్యం తిరుగుతుందని ఎవరూ రాత్రి వేళ ఒంటరిగా సంచరించవద్దని చెబుతున్నారు. మరోవైపు దెయ్యాలను నమ్మని హేతువాదులు.. అలాంటి వదంతలు నమ్మవద్దని చెబుతున్నారు. ఏదైనా ప్లాస్టిక్ కవర్ గాల్లో ఎగిరి ఉండవచ్చని, దాన్ని చూసి దెయ్యం అనుకుంటున్నారని అంటున్నారు. అది నిజంగా దెయ్యమేనని నిరూపిస్తే రూ.25 లక్షల ఇస్తానని హరీష్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తి సవాలు విసిరాడు. అయితే, ఈ వింత ఆకారంపై స్థానికులు రకరకాల కథలు వినిపిస్తున్నారు.
బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నా ఆ అమ్మాయే దెయ్యమైందా?: ఆ వింత ఆకారం వీడియో జులై 19, రాత్రి 12.30 గంటల సమయంలో రికార్డైంది. ఆ ఆకారం రాజేంద్ర ఇంటి ముందు నుంచి పాడుబడిన ఇంటికి వేగంగా వెళ్లిపోయింది. ఆ పాడుబడిన ఇంటి వద్ద ఓ బావి ఉందని, కొన్నాళ్ల కిందట ఓ యువతి అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుందని, ఆ యువతే ఇప్పుడు దెయ్యంలా తిరుగుతుందనే వదంతులు షికారు చేస్తున్నాయి. శతాబ్ది నగర్‌లో దొంగల బెడద ఎక్కువగా ఉండటంతో రాజేంద్ర ఇటీవలే తన ఇంటి ముందు సీసీటీవీ కెమేరా ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఏదో అలికిడి వినిపించడంతో సీసీటీవీ కెమేరా వీడియోను పరిశీలించగా.. ఈ ఆకారం కనిపించింది.
నాగపూర్ శతాబ్దినగర్‌లో కనిపించిన ఆ వింత ఆకారం వీడియోను ఇక్కడ చూడండి:
గమనిక: ‘ఏబీపీ దేశం’ ఈ వదంతులను ప్రోత్సహించడం లేదు. స్థానికులు తెలిపిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించామని గమనించగలరు.
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!