Bharat Bandh: దేశవ్యాప్తంగా 'భారత్ బంద్' ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. దిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ భారీ స్తంభించిపోయింది.
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగిస్తోన్న పోరాటానికి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు నేడు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. దిల్లీ, పంజాబ్, హరియాణా రహదారులపై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రోడ్లను దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Massive traffic snarl seen at Gurugram-Delhi border as vehicles entering the national capital are being checked by Delhi Police and paramilitary jawans, in wake of Bharat Bandh called by farmer organisations today. pic.twitter.com/dclgkqp3X1
— ANI (@ANI) September 27, 2021
Farmers protest at Ghazipur border continue as farmer organisations call a “Bharat Bandh” today against the three farm laws.
— ANI UP (@ANINewsUP) September 27, 2021
The traffic movement has been closed from Uttar Pradesh towards Ghazipur due to protest. pic.twitter.com/Tvobcyz9FD
ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లు యథావిధిగా సాగుతున్నాయి.
Karnataka: Various organizations protest outside Kalaburagi Central bus station as farmer organisatons call for Bharat Bandh today against 3 farm laws
— ANI (@ANI) September 27, 2021
"Many organizations are supporting our farmers and participating in the nation-wide call for bandh," says protester K Neela pic.twitter.com/QQMyZUcqKH
కిసాన్ భారత్ బంద్..
- 40 సంఘాల రైతులు ఏకతాటిపైకి వచ్చి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేెఎమ్) ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారులపై వాహనాలను వెళ్లనివ్వటం లేదు. దిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేను ఘాజీపుర్ వద్ద రైతులు దిగ్బంధించారు.
- గురుగ్రామ్-దిల్లీ సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. దిల్లీలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
- అంబులెన్స్‌లు, ఆసుపత్రులు యథావిధిగా నడుస్తాయని వాటిని మేం ఆపడం లేదని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసినట్లు తెలిపారు.
- దిల్లీ, పంజాబ్, హరియాణాతో పాటు కర్ణాటక, బిహార్‌లోనూ భారత్ బంద్ కొనసాగుతోంది.
- కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ, టీడీపీ.. సహా పలు విపక్షపార్టీలు ఈ బంద్‌కు మద్దతిచ్చాయి.