By: ABP Desam | Updated at : 06 Feb 2023 03:12 PM (IST)
Edited By: jyothi
ముషారఫ్ పై శశిథరూర్ ట్వీట్ - శాంతికోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా చెప్పడంపై దుమారం
Musharraf News: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. శాంతి కోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా ముషారఫ్ ను అభివర్ణించడంపై అధికార బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశ సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని శాంతి కోసం ప్రయత్నించిన వ్యక్తిగా ఎలా అభివర్ణిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి థరూర్ తిరిగి కౌంటర్ ఇవ్వడంతో వివాదం పెద్దది అయిపోయింది. భారత్ లో కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్. అయితే అరుదైన రుగ్మతతో బాధపడుతున్న ఆయన దుబాయ్ లో చికిత్సపొందుతూ ఆదివారం రోజు చనిపోయారు. ఆయమ మరణంపై శశి థరూర్ ట్వీట్ చేశారు.
“Pervez Musharraf, Former Pakistani President, Dies of Rare Disease”: once an implacable foe of India, he became a real force for peace 2002-2007. I met him annually in those days at the @un &found him smart, engaging & clear in his strategic thinking. RIP https://t.co/1Pvqp8cvjE
— Shashi Tharoor (@ShashiTharoor) February 5, 2023
"ఒకప్పుడు భారత దేశానికి శత్రువు. ఆయనే 2002-2007 మధ్య శాంతి స్థాపనకు నిజమైన శక్తిగా మారారు. ఆ రోజుల్లో ఆయన్ని ఏటా ఐరాసలో కలిసేవాడిని. వ్యూహాత్మక ఆలోచనలతో తెలివిగా, ఆకర్షణీయంగా, స్పష్టంగా కనిపించేవారు" అంటూ ముషారఫ్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ థరూర్ ట్వీట్ చేశారు. దీనిపై అధికారం బీజేపీ తీవ్ర స్థాయిలో రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. "మన దేశంలోకి ఉగ్రవాదాన్ని చొప్పించి.. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా మన సైనికులను హింసించిన వ్యక్తిలో మీరు శాంతిని వెతుకుతున్నారా అని ప్రశ్నించారు.
Pervez Musharraf- architect of Kargil, dictator, accused of heinous crimes - who considered Taliban & Osama as “brothers” & “heroes” - who refused to even take back bodies of his own dead soldiers is being hailed by Congress! Are you surprised? Again, Congress ki pak parasti! 1/2 pic.twitter.com/I7NnLRRUZM
— Shehzad Jai Hind (@Shehzad_Ind) February 5, 2023
దీనికి థరూర్ బదులు ఇస్తూ.. చనిపోయిన వ్యక్తి గురించి మాటలు మాట్లాడే భారత్ లో తాను పెరిగానన్నారు. ముషారఫ్ భారత్ కు శత్రువే. కార్గిల్ యుద్ధానికే బాధ్యుడే. కానీ 2002-2007 మధ్య తన స్వప్రయోజనాల కోసం భారత్ తో శాంతిని బలంగా కోరుకున్నారు. భారత్ కు మిత్రుడు కాకపోయినప్పటికీ.. మనలాగే శాంతిలోనే ఆయన తన వ్యూహాత్మక ప్రయోజనాలను వెతుక్కున్నారని థరూర్ ట్వీట్ చేశారు.
Question to BJP leaders frothing at the mouth: if Musharraf was anathema to all patriotic Indians, why did the BJP Government negotiate a ceasefire with him in 2003 & sign the joint Vajpayee-Musharraf statement of 2004? Was he not seen as a credible peace partner then?
— Shashi Tharoor (@ShashiTharoor) February 6, 2023
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
ABP Desam Top 10, 20 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్
సీయూఈటీ (పీజీ) పరీక్ష షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం