అయోధ్యకు తరలి వస్తున్న VIPలు, ప్రైవేట్ జెట్స్‌కి ఫుల్ డిమాండ్ - ముందుగానే బుకింగ్స్
Ram Mandir Inauguration: అయోధ్య ఉత్సవానికి ప్రముఖులు తరలి వస్తుండడం వల్ల ప్రైవేట్ జెట్స్‌కి డిమాండ్ పెరిగింది.
Ramlala Pran Pratishtha: మరికొద్ది గంటల్లో అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వందల ఏళ్ల కల తీరే ఆ అపురూప ఘట్టం కోసం కళ్లుల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు భక్తులు. అయోధ్యకు వరుస కడుతున్నారు. ఇప్పటికే కొందరు అక్కడికి చేరుకుని ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చారిత్రక సన్నివేశాన్ని చూసి తరించేందుకు వేలాది మంది అతిథులు తరలి వస్తున్నారు. దాదాపు 8 వేల మంది ప్రముఖులకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. వీళ్లలో చాలా మంది VIPలు ఉన్నారు. వీళ్లంతా ప్రైవేట్ జెట్స్‌లో అయోధ్యకి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఫలితంగా...ఈ ప్రైవేట్ జెట్స్‌కి (Private Jets for Ayodhya) డిమాండ్ అమాంతం పెరిగింది. చాలా మంది ముందుగానే బుక్ చేసుకున్నారు. వచ్చే వారమంతా ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా వరస పెట్టి ట్రిప్స్ బుక్ అయినట్టు ప్రైవేట్ జెట్ సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి. అయోధ్యకు ఆహ్వానం అందడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న ప్రముఖులు వాళ్ల హోదాకు తగ్గట్టుగానే హుందాగా అక్కడికి చేరుకోవాలని భావిస్తున్నారు. కేవలం రేపు ఒక్కరోజే (జనవరి 22) దాదాపు 100 ప్రైవేట్ జెట్స్ బుక్ అయినట్టు తెలుస్తోంది. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌లో ఈ జెట్స్ ల్యాండ్ అయ్యేందుకు స్లాట్స్ సిద్ధం చేస్తున్నారు. అటు వారణాసి వద్ద ఎయిర్‌పోర్ట్‌లోనూ స్లాట్స్ బుక్ అయ్యాయి. గోర్‌ఖ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఇదే పరిస్థితి.
అంత ధర..?
అయితే...ఈ ఛార్టర్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నాయన్నది సరైన వివరాలు లేవు. ప్రస్తుతానికి వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారమైతే ముంబయి నుంచి గోరఖ్‌పూర్‌కి వచ్చే ఫ్లైట్‌లో 9 మందికి 74 వేల డాలర్లు వసూలు చేస్తున్నారు. కేవలం ప్రైవేట్ జెట్స్‌కే కాదు. జ్యువెలరీ షాప్‌లలోనూ డిమాండ్ పెరిగింది. బంగారంతో తయారు చేసిన అయోధ్య ఆలయ ఆకృతులకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. అటు రాముడి ప్రతిమలనూ ఎక్కువగా కొంటున్నారు. వీటి ధర రూ.30 వేల నుంచి రూ.2 లక్షలపైవరకూ ఉంటోంది. అయినా సరే వెనకాడకుండా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. వీటి డిమాండ్‌కి తగ్గ సప్లై లేక ఔటాఫ్ స్టాక్ బోర్డ్‌లు పెడుతున్నాయి జ్యువెలరీ షాప్‌లు. కొంత మంది వీటిని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారు. మరి కొందరు ఇంట్లోనే పెట్టుకుని మురిసిపోతున్నారు.
జనవరి 22న బాలరాముడిని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు రాములోరి గుడి తలుపుకు తాళం వచ్చేసింది. తాళం అంటే సాదాసీద తాళం కాదు.. 400 కేజీల తాళం. అదికూడా ఒక కళాకారుడు చేత్తో తయారు చేశాడు. ఇక ఇప్పుడు ఆ తాళం అయోధ్యపురికి చేరుకుంది. రాములోరి గుడికి తయారు చేసిన తాళం ఏకంగా 400 కేజీలు. దీన్ని అయోధ్యలోని రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ తయారు చేశారు. సత్యప్రకాశ్ శర్మ చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. శ్రీరాముడికి ఆయన పరమ భక్తుడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అయోధ్య రాముడి గుడికి ప్రత్యేకంగా ఈ తాళాన్ని తయారు చేశారు. కాగా.. సత్యప్రకాశ్ భార్య రుక్మిణి కూడా తాళం తయారీలో సాయం చేశారు. ఇక వాళ్ల కుటుంబం కొన్ని తరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతోంది.
Also Read: Ram Mandir: రామసేతు ప్రారంభమైన చోట ప్రధాని ప్రత్యేక పూజలు, ధనుష్‌కొడిలో కాసేపు గడిపిన మోదీ