అన్వేషించండి

Ayodhya Ram Mandir Donation Scam: అయోధ్య ఆలయంలో స్కామ్‌కు కారణం కింది స్థాయి వ్యక్తులేనా ? - పెద్దలకు తెలియకుండా జరుగుతుందా?

Ayodhya:అయోధ్య ఆలయంలో జరిగిన నిధుల గోలమాల్ యూపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సిట్ కింది స్థాయి వ్యక్తుల్నే అరెస్టు చేసింది. పెద్దల సంగతేమిటన్న ప్రశ్న వస్తోంది.

Yogi Adityanath Zero Tolerance Ayodhya:  భారతదేశ వ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయం  లో విరాళాల దుర్వినియోగం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భక్తులు సమర్పించిన కానుకలు, నగదును కొందరు  నొక్కేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎస్ఐటీ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా శుక్రవారం   ఎనిమిది మందిని అరెస్టు చేశారు.  నిందితులకు జూన్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ భారీ స్కామ్ వెలుగులోకి రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ , మెంబర్ ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు తక్షణమే రాజీనామా చేశారు. అయితే ఈ స్కామ్ లోతును చూస్తే ఖచ్చితంగా పెద్దల హస్తం ఉంటుందన్న అనుమనాలున్నాయి. 

సీసీటీవీలో దొరికిపోయినా  దొంగలు

ఈ కేసుకు సంబంధించిన లోతైన వివరాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఆలయంలోని కానుకల హుండీ లెక్కింపు విభాగంలో పనిచేసే మనీష్ యాదవ్ అనే నిందితుడు పలుమార్లు నగదును దొంగిలిస్తుండగా సీసీటీవీ   కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. అయినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రామ్ మందిర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్, అత్యంత సన్నిహితుడైన రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను .. ఈ మనీష్ యాదవ్‌కు బంధువు కావడమే ఇందుకు కారణం. టిన్ను తనకున్న అధికార బలంతో మనీష్‌ను క్యాష్ కౌంటింగ్ యూనిట్‌లో చేర్పించడమే కాకుండా, అతను దొంగతనాలు చేస్తున్నా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా కప్పిపుచ్చినట్లు తేలింది. కొన్ని విజువల్స్‌లో సీసీటీవీ కెమెరాలను కవర్ చేసి, దొంగిలించిన డబ్బును టాయిలెట్లలో దాచినట్లు కూడా విచారణలో వెల్లడైంది. 

 రూ. 7.5 కోట్ల కుంభకోణం.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్, నగదు రికవరీ! 

అయోధ్య మాజీ ఎస్పీ ఎమ్మెల్యే పవన్ పాండే ఈ ఆలయ విరాళాల్లో దాదాపు రూ. 7 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల మేర అవినీతి జరిగిందని తొలిసారిగా ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్ఐటీ.. ఆరోపణల్లో నిజముందని తేల్చడంతో భారతీయ న్యాయ సంహిత  లోని పలు కఠిన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్   నమోదైంది. ఈ కేసులో రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, మనీష్ యాదవ్, లవ్‌కుష్ మిశ్రా, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు బ్యాంక్ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి చెందిన కౌంటింగ్ సిబ్బంది కాగా.. మిగిలిన ఇద్దరు వెలుపలి వ్యక్తులు. నిందితుల నుండి ఇప్పటివరకు రూ. 79.85 లక్షల నగదును ఇన్వెస్టిగేటర్లు రికవరీ చేశారు. 

 నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న చంపత్ రాయ్! 

ఈ వ్యవహారం సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు మెట్లు ఎక్కడం, విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో రామ్ మందిర్ ట్రస్ట్ ప్రతిష్ట మసకబారకుండా ఉండేందుకు చంపత్ రాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత డ్రైవర్ టిన్ను యాదవ్ ఈ దొంగతనాల నెట్‌వర్క్‌ను నడిపించాడనే ఆరోపణలు రావడంతో.. చంపత్ రాయ్ మరియు ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా సమర్పించారు.  

ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం యోగి

మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఈ కుంభకోణంపై అత్యంత సీరియస్‌గా స్పందించారు.  సనాతన ధర్మం , భక్తుల నమ్మకాలతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సిట్ నివేదిక రాగానే తక్షణమే కఠిన చర్యలు ప్రారంభించాం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే జైలు శిక్ష అనుభవించాల్సిందే.. ఎవరికీ మినహాయింపు ఉండదు" అని స్పష్టం చేశారు. అలాగే, ఈ వివాదాన్ని కొందరు రాజకీయంగా వాడుకుని అయోధ్య ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ చేసిన విమర్శలు హాస్యాస్పదమని, దర్యాప్తును చట్టప్రకారం తార్కిక ముగింపునకు రానివ్వాలని సీఎం యోగి పిలుపునిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Bilateral Revenue War: వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Chahal Dark Phase: చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
Embed widget