Assam: వాహనాలకు నిప్పంటించిన దుండగులు.. ఐదుగురు సజీవదహనం
అసోంలో కొంతమంది దుండగులు ట్రక్రులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు.
అసోంలో దుండగులు రెచ్చిపోయారు. డిమా హాసాఓ జిల్లా డియుంగ్ ముఖ్లో బొగ్గు లోడుతో ఉన్న ఏడు ట్రక్కులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదనమయ్యారు. చనిపోయిన ఐదుగురిని ట్రక్కు డ్రైవర్లుగా గుర్తించారు. ట్రక్కుల్లో మొత్తం 10 మంది ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ట్రక్కులన్నీ కాలి బూడిదయ్యాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Assam | Five people died after miscreants set ablaze seven trucks near Dismao village on Umrangso Lanka road in Dima Hasao last night; police investigation underway pic.twitter.com/7kCc4I9a6n
— ANI (@ANI) August 27, 2021
ఎవరు చేశారు?
డీఎన్ఎల్ఏ ఉగ్రసంస్థకు చెందిన సభ్యులే ఈ దుశ్యర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. అసోంలో డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) ఉగ్ర సంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 14, 15 తేదీల్లో డిమా హాసాఓ సహా మరో 5 జిల్లాల్లో 36 గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చింది డీఎన్ఎల్ఏ. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజున డిమా హాసాఓ జిల్లాలోని మైబాంగ్లో కాల్పులకు తెగబడింది.
Also Read: Covid 19 India Cases: దేశంలో కొత్తగా 44,658 కేసులు.. కేరళలో తగ్గని వైరస్ ఉద్ధృతి
డిమా హలీమ్ దాఓబాగ్ (డీహెచ్ డీ) అనే అసోంలోని ఉగ్రవాద సంస్థ యాక్టివ్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. దాల్మియా సిమెంట్ కు చెందిన 6 ట్రక్కులను అప్పుడు వీరు కాల్చి బూడిద చేశారు. 8 మందిని చంపేశారు. ఇప్పుడు డీఎన్ఎల్ఏ కూడా అదే దారిలో నడవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఈ డీఎన్ఎల్ఏ యాక్టివ్ అవడం వల్ల అసోంలో మళ్లీ కలకలం రేగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
Also Read: Sonu Sood Brand Ambassador: కేజ్రీవాల్- సోనూసూద్ భేటీ.. కారణం ఇదేనా?