By: ABP Desam | Updated at : 01 Aug 2021 02:08 AM (IST)
12వ తరగతిలో 94 శాతం మార్కులు సాధించిన నటి అన్షూర్
నిన్ననే పన్నెండో క్లాస్‌లో 94 శాతం మార్కులతో పాసైంది. కానీ ఇప్పటికే ఆ పిల్ల తన డ్రీమ్ హోమ్‌ను బుక్ చేసేసింది. తన కలలకు తగ్గట్లుగా నిర్మించుకుంటోంది. ఇక బీఎండబ్ల్యూ కొనాలని తన లక్ష్యం అని చెబుతోంది. దాన్ని కూడా ఐదారు నెలల్లో సాధించాలని అనుకుంటోంది. ఇంతకూ ఆ విద్యార్థి ఎవరంటే... అష్నూర్ కౌర్. ఈమె ఎవరనుకుంటున్నారా.. హిందీ సీరియల్స్, సినిమాల్లో బాల నటిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. జాన్సీకి రాణి, యేరిస్తా క్యా కెహతా హై, పటియాలా బ్రదర్స్ వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ మూవీ సంజూలోనూ నటించింది. ఆమె సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షల్లో 94 శాతం మార్కులు సాధించింది. నిజానికి సీబీఎస్ఈ పరీక్షలు పెట్టలేదు. కానీ ఇంటర్నల్ అసెస్‌మెంట్ చేస్తూ మార్కులు ఇచ్చింది. దీంట్లో కౌర్ 94శాతం మార్కులతో టాప్ గ్రేడ్ తెచ్చుకుంది. ఈ విషయం తెలిసి కౌర్‌ను అందరూ అభినందించారు.
కౌర్ తన డ్రీమ్ హౌస్ కొనుగోలు చేశానని... త్వరలో బీఎండబ్ల్యూ కొంటానని చెబుతోంది.. అంత మాత్రానికే ఆగిపోవడం లేదు. తాను చైల్జ్ ఆర్టిస్ట్ అయినా... సీనియర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నారు... అలాగని చదువు కూడా ఆపాలని అనుకోవడం లేదు. ఉన్నత చదువులు చదవాలని అనుకుంటున్నారు. విదేశాలకు వెళ్లి సినిమా రంగానికి సంబంధించి ఫిల్మ్ మేకింగ్.. డైరక్షన్ కోర్సులు చేయాలని భావిస్తోంది. షూటింగ్‌లతో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ... ప్రతీ దశలో సీబీఎస్‌ఈ తరగతులకు హాజరవడమే కాకుండా.. ఇంటర్నల్ పరీక్షల్లో బాగా మార్కులు సాధించడమే.. అష్నూర్ కౌర్ పట్టుదలకు నిదర్శనం. ఈమె పదో తరగతిలో 93 శాతం మార్కులు సాధించింది. ఇప్పుడు అంత కంటే ఒక శాతం ఎక్కువే మార్కులు సాధించింది. అందుకే అటు చదువులోనూ.. ఇటు నటనలోనూ స్టార్‌గా అందరి ప్రశంసలు పొందుతోంది అష్నూర్ కౌర్.
గ్లామర్ ఇండస్ట్రీ అనేది భిన్నమైన ప్రపంచం. ఒక్కసారి అందులోకి దిగితే... ఇక చదువుపై దృష్టి పెట్టడం బాల నటీనటులకు అంతగా సాధ్యం కాదు. అయితే ఈ పరిస్థతిని అష్నూర్ కౌర్ సులువుగా అధిగమించింది. నటనలో ఎలా అయితే డిస్టింక్షన్ సాధించిందో... అంతకు మించి చదువులోనూ సత్తా చాటుతోంది. అంద చందాలతో... అమాయకమైన నటనతో లక్షల మంది అభిమానుల్ని ఇప్పటికే సంపాదించుకున్న అష్నూర్ కౌర్... ఇప్పటికే చాలా మంది జీవితాంతం ఉద్యోగమో... వ్యాపారమో చేసినా... సంపాదించలేని డ్రీమ్ హోమ్‌ను సొంతం చేసుకుంది. ఇక ముందు ముందు ఆమె ఎలాంటి శిఖరాలను అధిరోహిస్తుందో అంచనా వేయడం కష్టమనుకోవచ్చు.. ఆకాశమే హద్దు అని ఆమె గురించి మనం భవిష్యత్‌లో చెప్పుకునే అవకాశం ఉంది.
Elon Musk on Twitter: గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది-ట్విటర్‌కు పది రోజులు బ్రేక్ ఇచ్చిన ఎలన్ మస్క్
PM Modi In Hyderabad : ప్రధాని మోదీ హైదరాబాద్‌లో దిగిన వెంటనే ఏం చేశారంటే?
Breaking News Telugu Live Updates: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి ఆదేశాలు
Yashwant Sinha About KCR: దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, తెలంగాణ సీఎంపై యశ్వంత్ సిన్హా ప్రశంసలు
East Godavari News : కోనసీమ జిల్లాలో ఘోరం, తల్లీకూతురు సజీవదహనం, అల్లుడిపై అనుమానం!
KCR on BJP: మోదీ మాట్లాడటం ఆపి మా ప్రశ్నలకు జవాబు చెప్పండి :కేసీఆర్
Facts about Ghosts: దెయ్యాలు ఉన్నాయా? ఆత్మలు కనిపిస్తాయా? ఈ వాస్తవాలు మిమ్మల్ని షేక్ చేస్తాయ్!
Just Asking : ప్రకాష్ రాజ్ ఈజ్ బ్యాక్ - మోదీపై మళ్లీ సెటైర్లు !
MMTS Trains Cancelled: జూలై 3న హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు