అన్వేషించండి

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

Golden Tongue Mummies: ఈజిప్ట్‌లోని సెంట్రల్ డెల్టాలో తవ్వకాలు జరపగా బంగారు నాలుకలున్న మమ్మీలు బయట పడ్డాయి.

Golden Tongue Mummies:

డెల్టా ప్రాంతంలో..

ఈజిప్ట్‌లో "మమ్మీ"లపై ఎన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చినా...పరిశోధనలు చేసే కొద్ది కొత్త విషయాలు బయట పడుతున్నాయి. సెంట్రల్ నైల్ డెల్టాలోని ఓ సమాధిలో తవ్వకాలు జరపగా...మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని మమ్మీలు బంగారు నాలుకలతో ఉండటాన్ని గమనించారు పురావస్తు శాఖ అధికారులు. ఆర్కియాలజీ విభాగానికి సంబంధించిన సుప్రీం కౌన్సిల్ ఆదేశాలతో ఇక్కడ తవ్వకాలు జరపగా...ఇవి బయట పడ్డాయి. Egypt Independent ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ప్రాంతంలో మరెన్నో సమాధులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే....ఇవన్నీ ఒకే కాలానికి చెందినవి అయ్యుండవని భావిస్తున్నారు అధికారులు. ఈ మమ్మీలను బయటకు తీసిన సమయంలో నోళ్లలో "మనుషుల నాలుకను" పోలి ఉండే బంగారు రేకులను గుర్తించారు. కొన్ని మమ్మీల ఎముకలు బంగారంతో పూత పూయగా...మరి కొన్ని మమ్మీలు గోల్డ్ స్కారబ్స్‌ వద్ద పూడ్చివేసినట్టు గుర్తించారు. చెక్కతో తయారు చేసిన శవ పేటికలతో పాటు రాగితో తయారు చేసిన స్క్రూలు కనిపించాయి. మమ్మీలు జీర్ణావస్థలో ఉన్నాయని, బంగారు పూత మాత్రం అలాగే ఉందని అధికారులు వెల్లడించారు. డెల్టా ప్రాంతంలో Quesna Quarries Cemetery చాలా కీలకమైంది. మమ్మీలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందించింది ఈ శ్మశానం. 1989లో ఈ ప్రాంతాన్ని గుర్తించారు. రోమన్ కాలంలో ఇది ఆక్రమణకు గురైందని అంచనా వేస్తున్నారు. గతేడాది కూడా పురావస్తు అధికారులు బంగారు నాలుకతో ఉన్న ఓ పుర్రెను కనుగొన్నారు. అంతకు ముందు ఓ పురుషుడు, మహిళ, బాలుడి మమ్మీలను గుర్తించారు. ఇవి 2,500 సంవత్సరాల క్రితంవి అని తేల్చి చెప్పారు. 

వింత మమ్మీ..

ఇటీవల జపాన్‌లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన ‘మమ్మీ’ని చూసి ఆశ్చర్యపోయారు. నడుము వరకు మనిషిలా, మిగతా భాగం చేప తరహాలో ఉండటంతో షాకయ్యారు. అప్పటి వరకు ‘మత్స్యకన్య’ అనేది అపోహ మాత్రమే అని అనుకున్న పరిశోధకులు ఆ ఆలయంలో దొరికిన ‘మత్స్యకన్య’ను స్కాన్ చేయడం మొదలుపెట్టారు. 300 ఏళ్ల కిందట ఓ మత్స్యకారుడికి దొరికిన ఈ ‘మత్స్యకన్య’ను ఎవరు ఆలయంలో పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీయే. ‘మత్స్యకన్య’లో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయని, దాన్ని పూజిస్తే ఆరోగ్యంగా జీవిస్తారనే విశ్వాసంతో గత కొన్ని శతాబ్దాలుగా దానికి పూజలు అర్పిస్తున్నారు.  ఆ పెట్టలో ఉన్న నోట్ ప్రకారం 1736-1741 మధ్య కాలంలో ఒక మత్స్యకారుడు దాన్ని పట్టుకున్నాడని, దాన్ని అతడు ఓ సంపన్న కుటుంబానికి విక్రయించినట్లు ఉంది. ఒకాయమా ఫోక్‌లోర్ సొసైటీ బోర్డు సభ్యుడు హిరోషి కినోషితా ఈ మత్య కన్య మూలలను తెలుసుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాన్ని పరిశీలించడం కోసం ఇప్పటికే ఆలయ నిర్వాహకుల అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆ మమ్మీకి CT స్కాన్‌ నిర్వహించారు. దాని DNA నమూనాలను సైతం పరిశీలిస్తున్నారు. దాని ఫలితాలు ఈ ఏడాదిలో ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే, అది కోతి-చేప సంక్రమణ వల్ల పుట్టిన కొత్త జాతి కావచ్చని భావిస్తున్నారు. 

Also Read: Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget