By: ABP Desam | Updated at : 31 Dec 2021 12:16 PM (IST)
ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు (Representational Image)
AP Omicron Case Updates: AP Omicron cases news: ప్రపంచ వ్యాప్తంగా కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నుంచి బెంగళూరు మీదుగా రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.
జీనోమ్ సీక్వెన్సింగ్ సెంటర్‌కు శాంపిల్స్ పంపించి పరీక్షించగా ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన మరో 14 మందికి కొవిడ్19 నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా వారికి నెగెటివ్ వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 17 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. వారిలో ముగ్గురికి నెగెటివ్‌గా తేలింది.
#COVIDUpdates: 30/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 30, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,74,084 పాజిటివ్ కేసు లకు గాను
*20,58,510 మంది డిశ్చార్జ్ కాగా
*14,493 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,081#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/xABC70m1rX
Also Read: Petrol Price 31 December 2021: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు..
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా.. 33,188 నమూనాలు పరీక్షించారు. కొత్తగా.. 130 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా వైరస్ బారి నుంచి.. 97 మంది పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం 1,081 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రికాషనరీ డోస్, 15-18 ఏళ్ల టీనేజర్లకు వాక్సినేషన్ ప్రక్రియపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 15-18 ఏళ్లు టీనేజర్లకు జనవరి 1వ తేదీ నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు మధ్య గల వారికి జనవరి 3 నుంచి వాక్సినేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వైద్య ఆరోగ్య సిబ్బంది హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ప్రికాషనరీ డోస్ ఇవ్వనున్నారు.
Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర.. రూ.800 తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనలో ఊహించని ట్విస్ట్, బ్రిజ్ భూషణ్ ఇంటికి ఓ రెజ్లర్! కాంప్రమైజ్ కోసమేనా?
ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Viral Video: ఢిల్లీ మెట్రోలో యువకుల పిచ్చి చేష్టలు, డోర్‌కి కాళ్లు అడ్డం పెడుతూ నవ్వులు - వైరల్ వీడియో
Top 10 Headlines Today: ఢిల్లీ నుంచి ఈటలకు పిలుపు; సీఎం జగన్ కీలక హామీ - నేటి టాప్ 5 న్యూస్
Satellite Towns: బెంగళూరు శివార్లలో 5 శాటిలైట్ సిటీలు, ప్లాన్ రెడీ చేస్తున్న హౌజింగ్ బోర్డ్
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్