Petrol Price 31 December 2021: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు..
Petrol-Diesel Price 31 December 2021: ఇటీవల ఝార్ఖండ్ ప్రభుత్వం రూ.25 మేర ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు.
Petrol Price 31 December 2021: దేశంలో కొన్ని రోజుల కిందట కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో జీవితకాల గరిష్టానికి చేరిన ఇంధన ధరలు కాస్త తగ్గాయి. కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా కొంతమేర ధరలు తగ్గించినా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇటీవల ఝార్ఖండ్ ప్రభుత్వం రూ.25 మేర ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ధరలు తగ్గించడంతో అక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.91 కాగా... డీజిల్ ధర రూ.94.34 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్ లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 0.65 పైసలు పెరిగితే, డీజిల్‌పై 0.60 పైసల మేర పుంజుకుంది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.57 కాగా, డీజిల్ ధర రూ.94.95 గా ఉంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.58 పైసలు తగ్గి రూ.109.53 అయింది. డీజిల్ ధర రూ.0.54 పైసలు తగ్గడంతో రూ.95.85 అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడలో పెట్రోల్ ధర 24 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.65 అయింది. 22 పైసల చొప్పున పెరగడంతో ఇక్కడ డీజిల్ ధర రూ.96.69కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.85 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.90 కి చేరింది. డీజిల్ ధర 0.79 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.97 అయింది.
చిత్తూరు జిల్లాలో ఇలా..
చిత్తూరులోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.54 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.0.62 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ రూ.0.55 పైసల మేర పెరగడంతో ధర లీటర్ ధర రూ.96.56 అయింది.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Bank Holidays January 2022: జనవరిలో 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు
Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర.. రూ.800 తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!