అన్వేషించండి

Sankranthi Celebrations 2023: నగరిలో ఘనంగా సంక్రాంతి సంబురాలు - ముగ్గుల పోటీకీ అపూర్వ స్పందన

Sankranti Celebrations 2023: మంత్రి రోజా ఆధ్వర్యంలో  రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరిలో సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఇక్కడ నిర్వహించిన ముగ్గుల పోటీలకు అపూర్వ స్పందన వచ్చింది. 

Sankranti Celebrations 2023: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి  ఆర్కే రోజా "రోజా చారిటబుల్ ట్రస్ట్"  నేతృత్వంలో నగరిలో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. సంక్రాంతి, కొండచుట్టు ఉత్సవం సందర్భంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళల నుంచి అపూర్వ స్పందన లభించింది. తెలుగు వారి సాంప్రదాయంగా, అలంకరించిన ఎద్దుల బండిలో మంత్రి రోజా కమెడియన్, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీతో సభా వేదిక వద్దకు వచ్చారు. నగరి నియోజకవర్గంలోని మహిళలు వేసిన రంగురంగుల రంగవల్లులను మంత్రి సందర్శించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానాన్ని నిండుగా చెరకు గడల అలంకరణలతో, సాంప్రదాయ దుస్తులతో,  గంగిరెద్దుల సవ్వడితో, కోడి పందేల జోరుతో పండుగ జోష్ ని పెంచారు.

Sankranthi Celebrations 2023: నగరిలో ఘనంగా సంక్రాంతి సంబురాలు - ముగ్గుల పోటీకీ అపూర్వ స్పందన

మంత్రి రోజా స్వయంగా.. మహిళలకు మట్టి గాజులు వేసి, మెహందీ పెట్టి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానం చేశారు. సంక్రాంతి సందర్బంగా పొంగళ్లు పెట్టారు. అనంతరం చిలక జోస్యం స్టాల్ ను సందర్శించారు. చిన్నారుల కోలాటాలు, భరత నాట్య ప్రదర్శనలు, హారికథా ప్రదర్శన అహుతులను ఆకట్టుకుంది. మంత్రి  రోజా తన అత్త షణ్బగం పుట్టిన రోజును పురస్కరించుకొని సభా వేదికపై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆద్యంతం ఛలోక్తులతో మాట్లాడిన ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, ప్రముఖ హాస్య నటుడు అలీ.. చిన్నతనంలో తనకు వచ్చిన మొదటి బహుమతి లైఫ్ బాయ్ సోప్ గురించి చెప్పారు.

Sankranthi Celebrations 2023: నగరిలో ఘనంగా సంక్రాంతి సంబురాలు - ముగ్గుల పోటీకీ అపూర్వ స్పందన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరీ ఇస్తున్నారని మంత్రి రోజా తెలిపారు. నగరి కొండచుట్టూ మహోత్సవంలో 21 మంది దేవుళ్లు చక్కని అలంకరణలతో ఆశీర్వదిస్తారని తెలిపారు. 2004వ సంవత్సరం నుంచి కొండ చుట్టూ ఉత్సవానికి హాజరవుతున్నానని, ప్రస్తుతం పర్యటక శాఖ మంత్రిగా హాజరువుతుండడం ఆనందంగా చెప్పారు. భవాని ఐలాండ్‌లో జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజులపాటు గ్రామీణ వాతావరణాన్ని సృష్టించగా ప్రజలు తమ కుటుంబాలతో ఎంజాయ్ చేశారని చెప్పారు.

ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు

అందమైన రంగవల్లులు వేసిన వారికి మంత్రి రోజా బహుమతులను ఇచ్చారు. నగరికి చెందిన విజయకుమారి ప్రథమి బహుమతిగా ఫ్రిడ్డ్‌ను పొందారు. నగరికి చెందిన గిరిజ రెండో బహుమతిగా వాషింగ్ మెషిన్ ను గెలుచుకున్నారు. పుదుపేటకు చెందిన తేన్మోలి, భవ్య తృతీయ బహుమతి ఎల్ఈడీ టీవీ గెలుచుకున్నారు. కన్సలేషన్ బహుమతులుగా ఫెడల్ ఫాన్లను గుడ్డి కండ్రిగకు చెందిన దివ్య, లక్కమ్మ, పుత్తూరుకు చెందిన వాణి, వందన, నగరికి చెందిన లత, సౌమ్య, వి.కే.ఆర్. పురానికి చెందిన విజయకుమారి, శాంతి, పుత్తూరుకు చెందిన ముత్తులక్ష్మి, నాగేశ్వరి, పుష్పాంజలి, జమున, చిన్న తంగల్ కు చెందిన యమున, చందన కుమారి, చింతలపట్టేడకు చెందిన లక్ష్మి, సరస్వతి, నగరికి చెందిన గ్రేస్, సుజాత, గుండ్రజుకుప్పానికి చెందిన పార్వతి, చాందిని, లోకేశ్వరి, షాలిని సాధించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, తుడా సెక్రటరీ శ్రీలక్ష్మి, నగరి, పుత్తూరు మున్సిపల్, నగరి రూరల్, పుత్తూరు రూరల్, వడమలపేట, నిండ్ర, విజయపురం మండల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, వివిధ కమిటీల చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget