Top Headlines Today: గ్రీన్ ఎనర్జీతో ఆకాశమే హద్దు అన్న చంద్రబాబు! తన హత్యకు కుట్ర చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపణలు - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News Today | ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపునకు ఆపరేషన్ హెచ్ వైపు అధికారులు మొగ్గుచూపారు. ఇటు తెలంగాణలో తన హత్యకు కుట్ర జరుగుతోందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
గ్రీన్ ఎనర్జీకి ఆకాశమే హద్దు- ఎలా అమలు చేయాలనేది కీలకం: ఏపీ సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ వినియోగంలో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని అయితే దాన్ని ఎలా అమలు చేయాలనేదే కీలకాంశమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న నాల్గో గ్లోబల్ రీ అన్వెస్ట్ రెన్యూవబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. గుజరాత్‌లో పీటీఐ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ... "గ్రీన్ ఎనర్జీకి ఆకాశమే హద్దు. భవిష్యత్తులో దీనిని ఎలా అమలు చేయాలనేది చాలా కీలకం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. దాదాపు 7 రోజులుగా వాటిని తొలగించేందుకు సిబ్బంది చేస్తోన్న ప్రయత్నాలు సత్ఫలాన్నివ్వడం లేదు. బ్యారేజీ గేట్లకు అడ్డంగా చిక్కుకున్న భారీ ఇనుప బోట్లను తొలగించేందుకు నిపుణులతో కూడిన బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ క్రమంలో బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ ఇంజినీర్లు మరో ప్లాన్ అమలు చేస్తున్నారు. రెండు భారీ పడవలను ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వెలికి తీయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను సైతం ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతుందన్న ఆయన.. తాము అధికారంలోకి వస్తే ఎవర్నీ విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని... తనపై జరిగిన దాడి తర్వాత పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం చాలా దారుణమని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట సోమవారం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా తెలంగాణలో ‘విగ్రహ’ రాజకీయం నడుస్తోంది. సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్- రెండేసి చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణ సర్కారు మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ఉచితంగా చీరల పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది లబ్ధిదారులకు ఈ చీరలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుకు రెండు చీరలు చొప్పున పంపిణీ చేయనున్నారు. ఆర్థిక అంచనాలు, తయారీ విధానంతోపాటు లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నుంచి సమాచారాన్ని చేనేత జౌళి శాఖ ఇప్పటికే కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి