Chandra Babu:గ్రీన్ ఎనర్జీకి ఆకాశమే హద్దు- ఎలా అమలు చేయాలనేది కీలకం: ఏపీ సీఎం చంద్రబాబు
Global RE-Invest Renewable Energy Investors Meet:గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. గుజరాత్‌లో జరిగిన మీట్‌లో పాల్గొని పెట్టుబడులు ఆహ్వానించారు.
Global RE-Invest Renewable Energy Investors Meet : గ్రీన్ ఎనర్జీ వినియోగంలో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని అయితే దాన్ని ఎలా అమలు చేయాలనేదే కీలకాంశమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న నాల్గో గ్లోబల్ రీ అన్వెస్ట్ రెన్యూవబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు.
గుజరాత్‌లో పీటీఐ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ... "గ్రీన్ ఎనర్జీకి ఆకాశమే హద్దు. భవిష్యత్తులో దీనిని ఎలా అమలు చేయాలనేది చాలా కీలకం. ఇప్పుడు ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూ ఇయింగ్ బిజినెస్‌కు మారాల్సిన టైం వచ్చింది. ఈ మార్పుకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది."
గుజరాత్ గాంధీనగర్‌లో 3 రోజులపాటు జరిగే గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్పో సదస్సును
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 16, 2024
గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.#AndhraPradesh pic.twitter.com/2HWoAeq1rG
"మనం పోటీ విధానాలు అభివృద్ధి చేయాలి. ప్రతి అంశాన్ని రియల్ టైంలో నిర్వహించేలా చూసుకోవాలి. సౌర ఫలకాలను తయారు నుంచి గ్రీన్ హైడ్రోజన్‌ను ఎగుమతి చేయడం వరకు ఆంధ్రప్రదేశ్‌లో చాలా అవకాశాలు ఉన్నాయి." అన్నారాయన.
ముఖ్య వక్తలలో ఒకరైన ఆంధ్రా సిఎం రాష్ట్రంలో అన్‌టాప్డ్ గ్రీన్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడుల ఆహ్వానం కోసం ఇక్కడకు వచ్చారు.