X

Amaravati HighcCourt : అమరావతి అసైన్డ్ రైతుల ప్లాట్ల స్వాధీనం చేసుకోవద్దు .. జీవో నెం.316పై హైకోర్టు స్టేటస్ కో !

అమరావతి అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై స్టేటస్ కో ఇచ్చింది.

FOLLOW US: 

అమరావతికి భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో 316పై స్టేటస్ కో ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 316ను హైకోర్టులో సవాల్ చేస్తూ ఇంద్రనీల్‍బాబు  అనే న్యాయవాది పిటిషన్ వేసశారు. నోటీసులు ఇవ్వకుండా అమరావతిలో గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా కేటాయించిన ప్లాట్‍లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని లాయర్ ఇంద్రనీల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వైపు వాదనలు విన్న అనంతరం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల స్వాధీనానికి చర్యలు చేపట్టవద్దని ఏఎంఆర్డీఏకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. Also Read : టీడీపీ వర్సెస్ టీడీపీ !అమరావతి పరిధిలో  అసైన్డ్ భూములు కలిగిన రైతులు తమ అవసరాల కోసం వాటిని విక్రయించుకునేందుకు జీవో నంబర్ 41ని గత తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 41 ను రద్దు చేసి..  దాని స్ధానంలో జీవో నంబర్ 316 విడుదల చేశారు.  ప్రభుత్వం జారీ చేసిన 316వ నెంబర్ జీవో ప్రకారం అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనడం చట్ట విరుద్ధం. జీవో ఆధారంగా గతంలో జరిగిన క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ లావాదేవీలు నిర్వహించిన రైతులకు నోటీసులు జారీ చేసింది.  నివాస, వాణిజ్య ఫ్లాట్ల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఎందుకు వెనక్కు తీసుకోకూడదో చెప్పాలని, లేకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాల్ని బట్టి ఫ్లాట్ల కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో తెలిపారు. ఈ నోటీసులపై అసైన్డ్ రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. Also Read : రైతు సమస్యలపై టీడీపీ ఉద్యమంఅసైన్డ్ రైతుల్లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీరిలో ఓ కేటగిరీ కింద ఉన్న రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ రైతులకు ప్రభుత్వం నేరుగా అసైన్డ్ భూమి కేటాయించలేదు. కానీ కేటాయించిన వారి దశాబ్దాల కిందటే కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూములను అమరావతికి ఇచ్చారు. ప్రభుత్వం వారికి రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించింది. అయితే అసైన్డ్ భూములపై ఇప్పటికే లావాదేవీలు జరిగినందున కొనుగోలు చేయడం చెల్లదు కాబట్టి భూముల్ని వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను బట్టే తాము క్రయ విక్రయాలు జరిపినట్లు అసైన్డ్ భూముల అమ్మకం దారులు, కొనుగోలుదారులు చెప్తున్నారు. ప్రభత్వం కూడా గుర్తించిందని .. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఆ స్థలాలు, పొలాలుల తమవి కావని రద్దు చేయడం అంటే అన్యాయం చేయడమేనని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. Also Read : శ్రీవారి బ్రాండ్ అగర్‌బత్తీలు.. ప్రత్యేకతలు ఇవే ..!

Tags: amaravati highcourt asiend lands dalit amaravati land pooling

సంబంధిత కథనాలు

Hyderabad Crime:  పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Hyderabad Crime: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Kishan Reddy: కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం... ఎన్నికలు ముగిసినా దళిత బంధు ఎందుకు అమలు చేయడంలేదు... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

Kishan Reddy: కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం... ఎన్నికలు ముగిసినా దళిత బంధు ఎందుకు అమలు చేయడంలేదు... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?

Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!