(Source: ECI/ABP News/ABP Majha)
Indian Students US Visa: ఆల్ టైమ్ రికార్డ్.. 55 వేల మంది భారతీయ విద్యార్థులకు యూఎస్ వీసాలు
ఈ ఏడాది అత్యధికంగా 55 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసి అమెరికా రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు మంజూరు చేసిన వాటిలో ఇది ఆల్ టైమ్ రికార్డ్.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఎంతో మంది భారతీయులు కలలు కంటుంటారు. అలాంటి భారత విద్యార్థులకు అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అత్యధిక మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 55 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు.
Huge congratulations to our hardworking consular teams across the U.S. Mission in India. This year, more than 55K students are boarding planes to study in the United States, an all-time record in India. Wishing all students a successful academic year! https://t.co/t3ieDOoGvF pic.twitter.com/cGK4WsmcYn
— U.S. Embassy India (@USAndIndia) August 23, 2021
కొవిడ్ విజృంభిస్తున్నప్పటికీ అమెరికాకు పయనమయ్యే భారత విద్యార్థుల కోసం అధిక సంఖ్యలో వీసాలు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు.
వేగంగా మంజూరు..
కరోనా సెంకడ్ వేవ్ వల్ల దాదాపు రెండు నెలల పాటు వీసా జారీ పక్రియలో జాప్యం జరిగింది. ఈ సమయంలో వీసా ఇంటర్వ్యూ ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది మే లో ప్రారంభం కావాల్సిన ఇంటర్వ్యూ ప్రక్రియ జులైలో ప్రారంభించాల్సి వచ్చిందని అతుల్ కేశప్ అన్నారు. భారతీయ విద్యార్థులకు ఓ సెమిస్టర్ సమయం వృథా కాకుండా ఉండేందుకే సాధ్యమైనంత త్వరగా వీసాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
వీసాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్న అమెరికా విదేశాంగ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా వీసాలు జారీ కానీ విద్యార్థులకు త్వరలోనే వీసాలు జారీ అవుతాయన్నారు.
Also Read: First Salary: ఫస్ట్ శాలరీ తీసుకుంటున్నారా? మరి ప్లాన్ ఏంటి?