అన్వేషించండి

Flight Ban: విమానాలు ఎక్కేవారికి కొత్త రూల్స్ - ఈ వస్తువు తీసుకెళ్తే బయటే ఆపేస్తారు !

Airline bans power banks: విమానయాన సంస్థలు పవర్ బ్యాంక్స్ ను తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అక్టోబర్ ఒకటి నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చిది.

Airline bans power banks on flights from October 1:  ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లలో ఒకటైన ఎమిరేట్స్, తన విమానాల్లో పవర్ బ్యాంక్‌ల ఉపయోగాన్ని పూర్తిగా నిషేధించింది. అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి  తెచ్చింది.  పవర్ బ్యాంక్‌లను క్యారీ-ఆన్ లగేజ్‌లో లేదా వ్యక్తిగతంగా తీసుకెళ్లవచ్చు, కానీ విమానంలో ఉపయోగించడం పూర్తిగా నిషేధం. ఈ నిర్ణయం లిథియం బ్యాటరీలతో సంబంధించిన ఫైర్ రిస్క్‌లను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారతీయ ప్రయాణికులు ఎక్కువగా ఎమిరేట్స్‌ను ఉపయోగిస్తారు.  

ఎమిరేట్స్ అధికారిక ప్రకటన ప్రకారం, "విమానంలో ఏ రకమైన పవర్ బ్యాంక్‌ను ఉపయోగించడం నిషేధం. ఇది అక్టోబర్ 1, 2025 నుంచి అన్ని ఎమిరేట్స్ విమానాల్లో అమలులో ఉంటుంది" అని స్పష్టం చేశారు. ప్రయాణికులు పవర్ బ్యాంక్‌లను  పాకెట్ లేదా చిన్న బ్యాగ్‌లో  లేదా క్యారీ-ఆన్ లగేజ్‌లో మాత్రమే తీసుకెళ్లవచ్చు.  చెక్-ఇన్ బ్యాగ్‌లలో పవర్ బ్యాంక్‌లు పూర్తిగా నిషేధించారు.                 

ఈ నియమం ప్రపంచవ్యాప్తంగా ఎమిరేట్స్ విమానాలకు వర్తిస్తుంది. భారతదేశం నుంచి దుబాయ్, లండన్, న్యూయార్క్ వంటి మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఇప్పుడు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయడానికి విమానంలోని USB పోర్ట్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది. "పవర్ బ్యాంక్‌లు సురక్షితంగా ఉంటే మాత్రమే తీసుకెళ్లండి. ఏదైనా లీకేజ్ లేదా డ్యామేజ్ ఉంటే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీకి అప్పగించండి" అని ఎమిరేట్స్ సలహా ఇచ్చింది.

లిథియం-అయాన్ బ్యాటరీలు  షార్ట్ సర్క్యూట్, ఓవర్‌హీటింగ్ వల్ల మంటలకు కారణం అవుతాయి. గతంలో అమెరికాలోని బోయింగ్ విమానాల్లో ఇలాంటివి జరిగాయి. పవర్ బ్యాంక్ సురక్షితమా అని తనిఖీ చేయాలంటే  UL  లేదా CE మార్క్ ఉండాలి. 100Wh కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నవి ఎయిర్‌లైన్ అనుమతి అవసరం. డ్యామేజ్‌డ్ లేదా స్వెల్ అయిన బ్యాటరీలను వద్దు తీసుకెళ్లకూడదు.  కాథే ప్యాసిఫిక్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లు కూడా పవర్ బ్యాంక్‌ల ఉపయోగాన్ని నిషేధించాయి. అయితే, వాటిని  తీసుకెళ్తే మాత్రం  కనిపించే చోట ఉంచాలి. ఇండిగో, ఏర్ ఇండియా వంటి భారతీయ ఎయిర్‌లైన్స్‌లు DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) మార్గదర్శకాల ప్రకారం 160Wh వరకు అనుమతిస్తున్నాయి, కానీ ఉపయోగం పరిమితం. ప్రపంచవ్యాప్తంగా ఈ నియమాలు మరింత కఠినమవుతున్నాయి       

ఈ మార్పు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా,  భద్రత కోసం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎమిరేట్స్ ప్రయాణికులకు SMS, ఈమెయిల్‌ల ద్వారా హెచ్చరికలు పంపింది.  భారతీయ ప్రయాణికులు ఎక్కువగా దుబాయ్ మార్గాలు ఉపయోగించేలా, DGCA కూడా ఈ నియమాలను అమలు చేయాలని పిలుపునిచ్చింది. ఈ మార్పు భవిష్యత్తులో ఇతర ఎయిర్‌లైన్స్‌ కూడా అనుసరిస్తాయి.                          

టాప్ హెడ్ లైన్స్

Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget