అన్వేషించండి

Hyundai Exter సన్‌రూఫ్‌ వెర్షన్‌ ఇప్పుడు దేశంలోనే చవక - GST తగ్గింపు బెనిఫిట్‌

GST తగ్గింపు తర్వాత, Hyundai Exter S Smart ఇప్పుడు సన్‌రూఫ్‌తో వచ్చే అత్యంత తక్కువ ధర SUVగా నిలిచింది. బలమైన మైలేజ్, అధునాతన ఫీచర్లు & అద్భుతమైన భద్రత దీని సొంతం.

Hyundai Exter Cheapest Sunroof SUV In India 2025: GST 2.0 అమలు తర్వాత, Hyundai Exter S Smart  దేశంలో అత్యంత తక్కువ ధర సన్‌రూఫ్‌ SUVగా మారింది. దీని కొత్త ధర ఇప్పుడు కేవలం ₹7.03 లక్షలు (ఎక్స్-షోరూమ్). ముఖ్యంగా, ఈ మైక్రో SUV టాటా పంచ్‌కు స్ట్రాంగ్‌ పోటీ పడుతుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ బేస్ వేరియంట్ ₹5.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఇంజిన్ & మైలేజ్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్ స్మార్ట్ 1.2 లీటర్ కప్పా (Kappa) పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 81.8 bhp & 113.8 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. ఈ మోడల్.. మాన్యువల్ & AMT గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 19.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది, CNG వేరియంట్ కిలోగ్రాముకు 27.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అంటే, ఈ కారు కేవలం పాకెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

ఫీచర్లు & సౌకర్యం
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రత్యేక లక్షణాలలో వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్ సన్‌రూఫ్ ఉన్నాయి, ఈ బడ్జెట్‌లో కార్లలో సాధారణంగా కనిపించని ఫీచర్‌ ఇది. మెరుగైన డ్రైవింగ్, భద్రత కోసం ముందు & వెనుక డాష్‌క్యామ్‌లు కూడా ఉన్నాయి. క్యావైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను క్యాబిన్‌లో చూడవచ్చు. సేఫ్టీ ఫీచర్లలో - ఆరు ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ & ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. ఇవన్నీ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు తక్కువ ధరలోనే ప్రీమియం టచ్‌ ఇస్తాయి.

ఏ కార్లతో కాంపీట్‌ చేస్తుంది?
ఈ ధరల శ్రేణిలో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు చాలా పోటీ కార్లు ఉన్నాయి - Tata Punch, Maruti Suzuki Fronx, Maruti Suzuki Ignis, Nissan Magnite, Renault Kiger, Citroen C3 & Hyundai Venue (బేస్ వేరియంట్). అయితే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్ స్మార్ట్ దాని సన్‌రూఫ్ & ఆధునిక ఫీచర్ల కారణంగా డబ్బుకు తగిన విలువ కలిగిన SUVగా లెక్కించవచ్చు.

టాటా పంచ్ & మారుతి సుజుకి ఫ్రాంక్స్ GST ప్రభావం
GST తగ్గింపు తర్వాత, టాటా పంచ్ ప్రారంభ ధర ₹6.19 లక్షల నుండి ₹5.49 లక్షలకు తగ్గింది. కస్టమర్లు ₹70,000 నుంచి ₹85,000 వరకు పొదుపు చేస్తున్నారు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ అన్ని వేరియంట్లలో 9.27% నుంచి 9.46% వరకు ధర తగ్గింపును చూసింది. టాప్ వేరియంట్‌లో ₹1.11 లక్షల వరకు డబ్బు సేవ్‌ అవుతుంటే, బేస్ మోడల్ ధర ₹65,000 నుంచి ₹73,000 వరకు తగ్గింది.

SUV స్టైలింగ్, సన్‌రూఫ్ & మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న బడ్జెట్‌ కారు కోసం మీరు గూగుల్‌ చేస్తుంటే, ఎక్స్‌టర్ మంచి ఆప్షన్‌ కావచ్చు. ఈ కాంపాక్ట్ SUVని సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా ఉపయోగించుకోవచ్చు. లాంగ్ డ్రైవ్‌లలోనూ మంచి ఇంధన సామర్థ్యాన్ని రాబట్టవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget