అన్వేషించండి

Tata Punch నుంచి Kia Sonet వరకు - దసరా సందర్భంగా లక్షల విలువైన డిస్కౌంట్లు

2025 దసరా సందర్భంగా Tata Punch, Maruti Suzuki S-Presso, Kia Sonet, Honda Amaze & Mahindra XUV3XO కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు లభిస్తున్నాయి.

Festive Season SUV Car Discounts Offers 2025: ఈ పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకుంటూ, ఆటోమొబైల్‌ కంపెనీలు తమ కస్టమర్లకు అద్భుతమైన డీల్స్‌ అందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి కొత్త (తగ్గిన) GST రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత, కార్ల ధరలు గణనీయంగా దిగి వచ్చాయి. దీనికి అదనంగా, డీలర్‌షిప్‌లు కూడా దసరా & దీపావళి  నవరాత్రి ఆఫర్‌లను (Dasara Diwali Car Offers 2025) అందిస్తున్నాయి. కొత్త కారుపై రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.65 లక్షల మధ్య ఆదా అవుతోంది.

Mahindra XUV 3XO Diesel
మహీంద్రా సబ్-4 మీటర్ SUV అయిన XUV 3XO డీజిల్ వేరియంట్‌, కొత్త బయ్యర్లకు రూ. 2.65 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో... రూ. 1.56 లక్షల GST తగ్గింపు & రూ. 1.09 లక్షల వరకు పండుగ తగ్గింపు ఉన్నాయి. ఇది, కాంపాక్ట్ SUV విభాగంలోని కస్టమర్లకు బెస్ట్‌ డీల్‌ అవుతుంది.

Honda Amaze
హోండా ప్రసిద్ధ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కూడా, ఈ పండుగ సీజన్‌లో తనను వెదుక్కుంటూ వచ్చిన కస్టమర్లను నిరాశపరచడం లేదు, గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. దీని సెకండ్‌ & థర్డ్‌ జనరేషన్‌ మోడళ్లపై రూ. 2.52 లక్షల వరకు ఆదా అందుబాటులో ఉంది. కస్టమర్లకు రూ. 65,100 నుంచి రూ. 1.20 లక్షల వరకు GST తగ్గింపులు & రూ. 1.32 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ ఆఫర్ అమేజ్‌ను బడ్జెట్-ఫ్రెండ్లీ సెడాన్ విభాగంలో గొప్ప ఎంపికగా చేస్తుంది.

Kia Sonet Diesel
కియా సోనెట్ కాంపాక్ట్ డీజిల్ SUV విభాగంలో అత్యంత పాపులారిటీ ఉన్న కార్లలో ఒకటి. ఈ దసరాకు, దీని డీజిల్ వేరియంట్ ధర రూ. 2.04 లక్షల వరకు తగ్గింది. ఇందులో - రూ. 1.64 లక్షల GST తగ్గింపు & రూ. 40,000 వరకు పండుగ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు, కియా సోనెట్ గతంలో కంటే మరింత అందుబాటులోకి వచ్చింది.

Maruti Suzuki S-Presso 
మీరు బడ్జెట్ సెగ్మెంట్లో మంచి కారు కోసం చూస్తున్నట్లయితే, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రస్తుతానికి ఉత్తమ ఎంపిక. కస్టమర్లు రూ. 1.90 లక్షల వరకు దీనిపై సేవ్‌ చేయవచ్చు. ఇందులో - రూ. 1.29 లక్షల GST తగ్గింపు & రూ. 61,000 వరకు పండుగ తగ్గింపు ఉంటుంది.

Tata Punch 
భారతదేశంలో అత్యంత ఎక్కువ ఆదరణ ఉన్న కాంపాక్ట్ SUVలలో ఒకటైన టాటా పంచ్ కూడా గొప్ప ఆఫర్‌ అందిస్తోంది. ఈ దసరా & దీపావళికి, ఈ కారు కొనేవాళ్లు రూ. 1.58 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో - రూ. 1.08 లక్షల GST తగ్గింపు & రూ. 50,000 వరకు పండుగ ప్రయోజనాలు ఉన్నాయి.

మీరు మీ డ్రీమ్‌ కార్‌ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. మహీంద్రా XUV 3XO, హోండా అమేజ్, కియా సోనెట్, మారుతి ఎస్-ప్రెస్సో & టాటా పంచ్‌లపై ఈ ఆఫర్‌లు మీకు లక్షల రూపాయలు ఆదా చేస్తాయి. GST తగ్గింపులు & పండుగ డిస్కౌంట్ల డబుల్ ప్రయోజనాన్ని పొందడం ద్వారా, మీరు మీ బడ్జెట్‌లోనే మీ కలల కారును ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget