అన్వేషించండి

GST తగ్గింపు తర్వాత Royal Enfield Hunter 350 లేటెస్ట్ డౌన్‌పేమెంట్, EMI వివరాలు ఇవే! - దీని ప్రత్యామ్నాయ బైక్‌లు ఏవి?

Royal Enfield Hunter 350: GST తగ్గింపు తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 కొనుగోలు గతంలో కంటే చవకగా మారింది. ఈ కథనంలో, ఈ బైక్ కోసం ఫైనాన్స్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

Royal Enfield Hunter 350 New Price, Down Payment, Loan EMI: జీఎస్‌టీ తగ్గింపు (New GST 2025) తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొనుగోలు గతంలో కంటే చవకగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో, ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 1.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ దీపావళి కల్లా కొత్త హంటర్ 350 ని తెచ్చి మీ ఇంటి ముందు పార్క్‌ చేయాలని చూస్తుంటే... ఈ బైక్ కొత్త ఆన్-రోడ్ ధర, లోన్‌పై తీసుకోవాలనుకున్నప్పుడు డౌన్ పేమెంట్ & EMI లెక్కల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం.

తెలుగు నగరాల్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొత్త ఆన్‌-రోడ్ ధర సుమారు రూ. 1,71,000. ఈ ధరలో... RTO ఫీజు దాదాపు రూ. 22,200, బీమా దాదాపు రూ. 11,000 & ఇతర ఛార్జీలు కలిసి ఉన్నాయి. ఈ ఆన్-రోడ్ ధర, నగరం & వేరియంట్‌ ఆధారంగా మారవచ్చు.​​​​​​​

లోన్‌పై తీసుకుంటే ఎంత EMI చెల్లించాలి?
మీ దగ్గర పూర్తి స్థాయిలో డబ్బు లేకపోయినా సరే, ధగధగలాడే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌ 350 కొనవచ్చు. దీనికి బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ నుంచి లోన్‌ తీసుకోవాలి. మొదట, మీరు కనీసం రూ. 10,000 డౌన్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత, మీరు బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ. 1.61 లక్షలు లోన్‌ తీసుకోవాలి. మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే లోన్‌ మంజూరవుతుంది & తక్కువ వడ్డీతో ఈ రుణం వస్తుంది. ఉదాహరణకు, 9% వార్షిక వడ్డీ రేటుతో మీరు ఈ రుణాన్ని పొందారని భావిద్దాం. ఇప్పుడు మంత్లీ EMI లెక్కలు చూద్దాం.

మీరు నెలకు రూ.  7,899 EMI చెల్లిస్తే, మీ బైక్‌ లోన్‌ మొత్తం 2 సంవత్సరాల్లో ముగుస్తుంది

మీరు నెలకు రూ. 5,668 EMI చెల్లిస్తే, మీ బండి రుణం 3 సంవత్సరాల్లో క్లియర్‌ అవుతుంది

మీరు నెలకు రూ. 4,552 EMI చెల్లిస్తే, మీ రుణ కాల వ్యవధి 4 సంవత్సరాలు అవుతుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పవర్‌ట్రెయిన్
ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, హంటర్ 350... 349cc J-సిరీస్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో దడదడలాడే పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 20.2 bhp & 27 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ & స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో అనుసంధామై స్మూత్‌ రైడింగ్‌ అనుభవం ఇస్తుంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొత్త కలర్ ఎడిషన్ కోసం బుకింగ్స్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లు, అధికారిక వెబ్‌సైట్ & యాప్‌ ద్వారా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇది ఏ బైక్‌లతో పోటీ పడుతుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కి ప్రత్యర్థి బైక్‌లు - TVS Ronin, Honda H'ness CB350 / CB350 RS  & Jawa  42 & Royal Enfield Bullet 350 వంటి రెట్రో-స్టైల్ బైక్‌లు. అయితే, Jawa  42 కొంచెం ఖరీదైనది.

మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బండిని ఫైనాన్స్‌లో తీసుకోవాలని ఆలోచిస్తుంటే, అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోండి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget