By: ABP Desam | Updated at : 02 May 2023 04:10 PM (IST)
Edited By: jyothi
తెలుపు, నలుపే కాదండోయ్ - నీలిరంగు కోడిగుడ్లూ ఉన్నాయని మీకు తెలుసా? ( Image Source : ABP Hindi )
Blue Egg: గుడ్లు.. అవి కోడి గుడ్లు అయినా, లేదా బాతు గుడ్లు, పిట్ట గుడ్లు అయినా ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి. కొన్ని గోధుమ రంగు కోడి గుడ్లను కూడా చూసే ఉంటాం. అయితే ఎక్కువగా కనిపించేవి మాత్రం తెలుగు రంగు గుడ్లే. అయితే కడక్‌నాథ్ కోళ్లు పెట్టే గుడ్లు నలుపు రంగులో ఉంటాయి. ఇవి చాలా ఖరీదైనవి కాబట్టి ఎక్కువగా కనిపించవ. అయితే వేరే ఇతర రంగుల్లో మాత్రం గుడ్లు కనిపించవు. కోడి గుడ్లను ఎప్పుడైన నీలి రంగులో ఉండటం చూశారా? ఓ దేశంలోని కోళ్లు నీలి రంగులో ఉండే గుడ్లను పెడతాయి. ఇది కొంచెం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. మరి ఆ గుడ్లు నీలి రంగులో ఉండటానికి మాత్రం ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ దేశపు కోడి గుడ్లు నీలిరంగులో ఉంటాయి..
అరౌకానా అనే జాతి కోళ్లు నీలి రంగు గుడ్లను పెడతాయి. ఈ రకం కోళ్లు ఎక్కువగా చీలి దేశంలో కనిపిస్తాయి. ఇలా గుడ్లు నీలి రంగులో ఉండటానికి కారణం మాత్రం వైరస్ లేనట. వైరస్ ల వల్లే ఇలా గుడ్లు నీలిరంగులో ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ జాతి కోడిని మొదటిసారిగా 1914 సంవత్సరంలో గుర్తించారు. స్పానిష్ పక్షి శాస్త్రవేత్త సాల్వడార్ కాస్టెల్ ఈ కోడిని గుర్తించాడు. చిలీ దేశంలోని అరౌకానియా ప్రాంతంలో ఈ కోడి మొదట కనిపించింది. అందుకే ఈ జాతి రకం కోడికి అరౌకానా అనే పేరు పెట్టారు. ఇది దేశీ రకం కోడి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వైరస్ కారణంగానే నీలి రంగులో గుడ్లు
రెట్రో వైరస్ వల్లే గుడ్లు నీలి రంగులోకి మారుతున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఒకే ఆర్ఎన్ఏ వైరస్ లు. రెట్రో వైరస్ లు కోళ్లలోకి ప్రవేశించి వాటి జన్యువు నిర్మాణాన్ని మారుస్తాయి. వీటిని ఈఏవీ-హెచ్పీ అంటారు. జన్యువుల నిర్మాణంలో మార్పు కారణంగా, కోడి గుడ్ల రంగు మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ, వైరస్ ఉన్నప్పటికీ ఈ రకం కోడి గుడ్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎందుకంటే వైరస్ లు గుడ్ల పెంకుపై మాత్రమే ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐరోపా దేశాలు, అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఈ జాతి కోళ్లను, ఈ నీలి రంగు కోడి గుడ్లను చాలా ఇష్టంగా తింటారట.
Odisha Train Accident: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో రైలు ప్రమాదాల్ని నియంత్రించొచ్చా? అదెలా సాధ్యం?
FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్, డాలర్ల వరద పారించిన ఫారినర్లు
Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్ - మీ అకౌంట్ పరిస్థితేంటో చెక్ చేసుకోండి
Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు
Odisha Train Accident: రైల్వేలో 3 లక్షలకు పైగా పోస్ట్‌లు ఖాళీ, ప్రమాదాలకు ఇదీ ఓ కారణమే!
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ