By: ABP Desam | Updated at : 13 Sep 2021 01:39 PM (IST)
Edited By: Murali Krishna
'మీ పట్టుదలకు ఆ శిఖరమే దాసోహం'.. భారత దివ్యాంగుల ప్రపంచ రికార్డ్
"మాకేం తక్కువ.. పేరుకే దివ్యాంగులం.. పట్టుదలలో మీకన్నా గొప్పవాళ్లం" ఈ మాటలను మరోసారి రుజువు చేశారు ఆ దివ్యాంగులు. 8 మంది బృందంగా ఏర్పడి ఏకంగా సియాచిన్ పర్వతాన్ని అధిరోహించారు. మంచుకొండల్లో వారు చూపిన మనోధైర్యానికి ఆ శిఖరమే దాసోహమైంది. ప్రపంచ రికార్డ్ వారి సొంతమైంది.
ఐదు రోజుల్లో..
భారత ఆర్మీ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ క్యాంపెయిన్ లో భాగంగా దివ్యాంగులు ఈ సాహసం చేశారు. ఆదివారం సియాచిన్ హిమానీనదంలో ఉన్న 15,632 అడుగుల ఎత్తైన కుమార్ పోస్ట్‌కు ఎనిమిది మంది దివ్యాంగులు చేరుకున్నారు. 60 కిలోమీటర్లను ఐదు రోజుల్లో వీరు అధిరోహించారు. చల్లటి గాలులు, ఊపిరి కూడా అందని వాతావరణంలో వీరు చూపిన తెగువకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
A World record was created today when 8 specially abled people reached Kumar Post at 15632 feet on Siachen glacier. #IndianArmy special forces veterans from @CLAW_Global & the grit of the team made Operation Blue Freedom a grand success.@adgpi @Whiteknight_IA @firefurycorps pic.twitter.com/9LtXGzWLkz
— NorthernComd.IA (@NorthernComd_IA) September 12, 2021
ఈ దివ్యాంగుల బృందానికి ఆర్మీకి చెందిన ప్రత్యేక దళాలు శిక్షణనిచ్చాయి. సెప్టెంబర్ 7న మొదలైన వీరి జైత్రయాత్ర సెప్టెంబర్ 11న ముగిసింది. వీరు చేసిన ఈ సాహసయాత్ర ప్రపంచ రికార్డులకెక్కింది.
ప్రతికూలతలు దాటి..
రోజుకు 15 కిమీ చొప్పున వీరు నడిచారు. యాత్ర సమయంలో చల్లగాలులు, మంచుగడ్డల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. కాన ఎక్కడా పట్టు వదలకుండా లక్ష్యాన్ని సాధించారని కొనియాడారు. వీరు సాధించిన విజయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Congratulations India & #IndianArmy for successfully achieved their historic target.
— Vaibhav Kaushik 🇮🇳 वैभव कौशिक (@vaibhavkaushiki) September 12, 2021
God bless you & your family.
Always entire Nation is Proud on you & your family.
Jai Hind🇮🇳
🙏🙏@adgpi @NorthernComd_IA #IndianArmy
Also Read: Delhi Building Collapse: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. సహాయక చర్యలు ముమ్మరం
SEBI: మ్యూచువల్ ఫండ్స్ నామినేషన్ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్-విపక్షాలతో మంతనాలు
Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్
Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత
SSMB 28 Title : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే